SNo
int64
0
21.6k
date
stringlengths
19
19
heading
stringlengths
3
91
body
stringlengths
6
38.7k
topic
stringclasses
5 values
414
11-05-2017 00:39:13
ఐడిబిఐపై ఆర్‌బిఐ నజర్‌
భారీ ఎత్తున మొండిబకాయిలు పెరిగిపోవడంతో ఐడిబిఐ వ్యవహారాలపై భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) ఒక కన్నేసింది. ఐడిబిఐ బ్యాంకును ఆర్‌బిఐ వాచ్‌లి్‌స్టలో చేర్చినట్టుగా తెలిసింది. నికర మొండిపద్దుల మొత్తం 6 శాతం దాటడం, వరసగా రెండేళ్ల పాటు నష్టాలను ప్రకటించడం, కాపిటల్‌ అడెక్వసీ నిర్దేశిత ప్రమాణాల కంటే తగ్గడం... ఈ సందర్భాల్లో బ్యాంకులను ఆర్‌బిఐ వాచ్‌ లిస్ట్‌లో చేరుస్తుంది. తమ బ్యాంకుకు సంబంధించి ఆర్‌బిఐ ప్రాంప్ట్‌ కరెక్టీవ్‌ యాక్షన్‌ (పిసిఎ) చేపట్టినట్టు ఐడిబిఐ వెల్లడించింది. గతంలో ఓవర్సీస్‌ బ్యాంక్‌, యునైటెడ్‌ బ్యాంక్‌కు సంబంధించి కూడా ఆర్‌బిఐ పిసిఎ చేపట్టింది. పిసిఎ వల్ల బ్యాంకుపై ఆర్థికంగా భారం పడదనీ, దీనివల్ల అంతర్గత నియంత్రణలు మెరుగుపడటంతో పాటు, కార్యకలాపాలు మెరుగవుతాయని ఐడిబిఐ వివరించింది. ఆర్‌బిఐ ఆదేశాలకు అనుగుణంగా ఇప్పుడు మూలధనాన్ని పొదుపుగా వినియోగించడంపై ఐడిబిఐ దృష్టి సారించాల్సి ఉంటుంది.ఇందులో భాగంగా పరపతిపై నియంత్రణలు విధించడం, నియామకాలను నిలిపేయడం, కొత్త పెట్టుబడి పథకాలను పక్కన బెట్టడంవంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుం ది. బ్యాంకు సరైన రీతిలో స్పందించని పక్షంలో మరో బలమైన బ్యాంకులో విలీనానికి సిద్ధం కావాల్సి ఉంటుంది.
business
2,668
12-06-2017 00:40:32
బ్యాంకింగ్‌ చీఫ్‌లతో నేడు జైట్లీ భేటీ
న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సోమవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల(పిఎస్ బి) చీఫ్‌లతో సమావేశంకానున్నారు. దాదాపు రోజంతా జరిగే ఈ సమావేశంలో పిఎస్ బిలకు గుది బండగా మారిన మొండి బకాయి(ఎన్‌పిఎ)ల వసూళ్లపైనే ప్రధానంగా చర్చ జరుగుతుందని భావిస్తున్నారు. ఇంకా పిఎస్ బిల పనితీరు, ఒత్తిడిలో ఉన్న రుణాల పరిస్థితి, బ్యాలెన్స్‌ షీట్ల ప్రక్షాళన కోసం బ్యాంకులు తీసుకున్న చర్యలు కూడా చర్చకు రానున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం పిఎస్ బిల చీఫ్‌లతో జైట్లీ జరుపుతున్న తొలి సమావేశం ఇదే. మొండి బకాయిల వసూలు కోసం 1949నాటి బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ను సవరిస్తూ ఆర్డినెన్స్‌ జారీ చేశాక జరుగుతున్న ఈ భేటీకి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ ఆర్డినెన్స్‌తో ఎన్‌పిఎల వసూళ్ల కోసం చర్యలు తీసుకోవాలని బ్యాంకులను ఆదేశించే అధికారం ఆర్‌బిఐకి ఏర్పడింది. ఇంకా ఈ సమావేశంలో ప్రధాన మంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన, అటల్‌ పెన్షన్‌ యోజన పథకాలపైనా సమీక్షించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి ముందే జైట్లీ సార్వత్రిక కనీస ఆదాయం (యుబిఐ), బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటుపై చర్చలు జరుగుతున్నట్టు చెప్పడం విశేషం.
business
19,923
19-01-2017 19:51:31
కీలక వికెట్ తీసిన జడేజా..
కటక్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న సెకండ్ వన్డే మ్యాచ్‌లో భారత జట్టు మూడో వికెట్ పడగొట్టింది. 82 పరుగులతో దూసుకెళుతున్న ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ జాసన్ రాయ్‌ను జడేజా ఔట్ చేశాడు. 27వ ఓవర్ మొదటి బంతికి క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ స్కోర్ 27 ఓవర్లు ముగిసే సమయానికి 172/3. మ్యాచ్ గెలిచేందుకు ఇంగ్లండ్ ఇంకా 209 పరుగులు చేయాల్సి ఉంది.
sports
15,762
23-11-2017 17:29:04
మరో రెచ్చగొట్టే చర్యకు దిగిన పాకిస్థాన్
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ అంతర్జాతీయ ఉగ్రవాది హపీజ్ సయీద్‌ స్వేచ్ఛనిచ్చి, భారతదేశానికి ఆగ్రహం తెప్పించింది. 24 గంటలు గడవక ముందే మరో రెచ్చగొట్టే చర్యకు దిగింది. కశ్మీరు అంశంపై అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పాకిస్థాన్ ప్రకటించింది. కశ్మీరులో నిత్యం మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించింది. తమ నిఘా వర్గాల కనుసన్నల్లోనే ఉగ్రవాదులను తయారు చేసి భారతదేశంలోకి పంపిస్తున్న పాకిస్థాన్ తీవ్రమైన ఆరోపణలతో భారతదేశంపై విరుచుకుపడటం చాలా దారుణం. మరోవైపు హఫీజ్ సయీద్ భారత వ్యతిరేక బహిరంగ సభలో త్వరలోనే మాట్లాడబోతున్నట్లు సమాచారం.
nation
8,624
03-04-2017 15:48:23
గోవాలో కొడుకుతో కలిసి అల్లు అర్జున్ స్విమ్మింగ్!
స్టార్‌ హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ కుటుంబంతో గడిపే అవకాశాన్ని ఏ మాత్రం వదులుకోవడం లేదు ఇప్పటి సినిమా హీరోలు. ఖాళీగా ఉన్నప్పుడు కుటుంబంతో గడపడం స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌కు అలవాటు. వృతిపరమైన విషయాలనే కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోవడం కూడా బన్నీకి అలవాటు.
entertainment
19,527
17-08-2017 02:04:06
ఆఫీసు బేరర్లను తొలగించండి..!
సుప్రీం కోర్టుకు సీవోఏ మధ్యంతర నివేదికన్యూఢిల్లీ: బీసీసీఐ పగ్గాలను పూర్తిగా తమ చేతికే అందించాలని కమిటీ ఆఫ్‌ అడ్మిస్ట్రేటర్స్‌ (సీవోఏ) సుప్రీం కోర్టును కోరింది. సంస్కరణల అమలుపై కోర్టుకు సమర్పించిన ఐదో మధ్యంతర నివేదికలో ఆఫీసు బేరర్ల ఉదాసీన వైఖరిని ఎండగట్టింది. లోధా కమిటీ సిఫారసుల అమల్లో విఫలమైన బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, కార్యదర్శి అమితాబ్‌ చౌదరి, కోశాధికారి అనిరుధ్‌ చౌదరిలను తొలగించాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. తదుపరి ఎన్నికలు జరిగేంత వరకు బోర్డు పరిపాలన, కార్యనిర్వహణ అధికారాలను తమకే అప్పగించాలని వినోద్‌ రాయ్‌, డయానా ఎడుల్జీ సభ్యులుగా ఉన్న సీవోఏ.. సుప్రీంను కోరింది. సీఈవో రాహుల్‌ జోహ్రీ లాంటి ప్రొఫెషనల్స్‌ నిర్వహిస్తున్న కార్యకలాపాలను కూడా తమకిందకే తీసుకురావాలని తెలిపింది. 26 పేజీల నివేదికలో లోధా సంస్కరణ అమల్లో విఫలమైన ఖన్నా, అమితాబ్‌, అనిరుధ్‌లను మాజీ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌, కార్యదర్శి అజయ్‌ షిర్కే తరహాలో తొలగించాలని సీవోఏ పేర్కొంది. ఆరు నెలలు దాటినా కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో వీరు విఫలమయ్యారని.. అందుకే వీరిపై వేటు వేయడం సరైనదే అని అభిప్రాయపడింది. జూలై 26న జరిగిన బీసీసీఐ ఏజీఎంలో సీఈవో, లీగల్‌ టీమ్‌ను సమావేశం నుంచి బయటకు వెళ్లమని కోరిన ఆఫీసు బేరర్లు.. కోర్టు ఆదేశాలను తప్పుదోవ పట్టించారని పేర్కొంది. ఆఫీసు బేరర్లపై అనర్హత, అపెక్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటును బీసీసీఐ పట్టించుకోవడం లేదని తెలిపింది. బోర్డు తీరు లోధా సిఫారసులకు వ్యతిరేకంగా ఉందని ఎస్‌జీఎంలో డీడీసీఏ అడ్మినిస్ట్రేటర్‌, రిటైర్డ్‌ జస్టిస్‌ విక్రమ్‌జిత్‌ సేన్‌ అభ్యంతరం వ్యక్తం చేసిన దాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. కొత్త అంబుడ్స్‌మన్‌ నియామకంతో పాటు పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంపై సవరణలు, నిధుల పంపిణీలో కొత్త నిబంధలను అమలు చేయడంలో బోర్డు విఫలమైందని సీవోఏ.. సుప్రీం కోర్టుకు నివేదించింది.
sports
16,516
25-02-2017 18:20:59
‘అమెరికాలో భారతీయులు మాతృభాషలో మాట్లాడొద్దు’
కన్సాస్ : విద్వేషపూరిత దాడుల నేపథ్యంలో ప్రవాస భారతీయుల్లో ఆందోళన తారస్థాయికి చేరింది. మనసారా మాతృభాషలో మాట్లాడుకోవాలన్నా భయపడుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో కలుసుకున్నపుడు ఆంగ్లంలోనే మాట్లాడుకోవాలని సామాజిక మాధ్యమాల ద్వారా చెప్పుకుంటున్నారు. ‘‘అమెరికాలో బహిరంగ ప్రదేశాల్లో కలుసుకున్నపుడు హిందీలోగానీ, ఏదైనా ఇతర భారతీయ భాషలో మాట్లాడుకోవద్దు. దానివల్ల మీకు తీవ్ర ఇబ్బందులు రావచ్చు’’ అని ప్రవాస భారతీయులు సామాజిక మాధ్యమాల్లో ఒకరికొకరు సందేశాలు పెట్టుకుంటున్నారు. శ్రీనివాస్ కూచిభొట్ల, అలోక్ మాడసానిలపై దాడి అనంతరం అమెరికాలో ఉంటున్న భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు, ఆందోళనతో విలవిలలాడుతున్నారు. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విక్రమ్ జంగమ్ కొన్ని ముందు జాగ్రత్తలను సూచించారు. మిగతా విషయాల కన్నా ప్రాణం చాలా విలువైనదని చెప్పారు. క్రింద పేర్కొన్న జాగ్రత్తలను దక్షిణాసియా దేశాలవారు, తెలుగువారు పాటించాలని తెలిపారు. - బహిరంగ ప్రదేశాల్లో ఇతరులతో వాదనకు దిగవద్దు. - ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే, ఎదురు మాట్లాడకుండా అక్కడి నుంచి తక్షణమే వెళ్ళిపోండి. - మన మాతృ భాషలో మాట్లాడటాన్ని మనం ఎంతగా ఇష్టపడితే అంతగా అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో ఇంగ్లిష్‌లో మాట్లాడుకోగలరేమో చూసుకోండి. - ఏకాంత ప్రదేశాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే అవకాశం ఉంటుంది. ఒంటరిగా వెళ్ళడం కానీ, ఒంటరిగా ఉండటం కానీ చేయకండి. - అత్యవసర పరిస్థితుల్లో 911కు ఫోన్ చేయడానికి సందేహించవద్దు. అటువంటి పరిస్థితుల్లో అధికారులు వచ్చి సహాయపడతారు. - మీ పరిసరాలను గమనిస్తూ ఉండండి, ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే చెప్పండి.
nation
20,186
17-06-2017 02:38:00
సూపర్‌ సండే !
అటు క్రికెట్‌.. ఇటు హాకీ రెండింటిలో దాయాదుల సమరంన్యూఢిల్లీ : ఈ ఆదివారం ఇతర ఏ కార్యక్రమాలూ పెట్టుకోకండి..! ఆటలపై అమితాసక్తి ఉ న్న వారైతే మరీను..! ఒకవేళ తప్పకుండా పాల్గొనాల్సిన కార్యక్రమం అయితే కనీసం మధ్యా హ్నం ఒంటి గంటకల్లా పూర్తి చేసుకొనేలా ప్లాన్‌ చేసుకోండి. ఎందుకంటే ఆ రోజు రెండు అతి ము ఖ్యమైన మ్యాచ్‌లు ఉండడమే. ఆ రెండూ దాయాదులు భారత్‌-పాకిస్థాన్‌లు తలపడుతున్నవే. అందులో ఒకటి క్రికెట్‌ అయితే మరొకటి జాతీయ క్రీడ హాకీ మ్యాచ్‌. రెండు మ్యాచ్‌లూ ఒకే రోజు.. అదీ ఒకటే నగరంలో జరగనుండడంతో మజాయే మజా! చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌-పాకిస్థాన్‌లు ఫైనల్‌కు చేరడంతో టోర్నీకి అద్భుత ముగింపు లభించనుంది. ఇక జరగబోయేది టైటిల్‌ ఫైట్‌. అం చనాలను పటాపంచలు చేస్తూ తుది సమరానికి దూసుకొచ్చి అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసిన పాక్‌.. లీగ్‌ దశలోలా చేతులెత్తేస్తుందా లేక కీలక పోరులో శక్తులన్నీ కూడదీసుకుని మ్యాచ్‌ను ఉ త్కంఠ భరితంగా మారుస్తుందా చూడాలి. కొద్దిరోజులుగా వరుణుడి జాడలేకపోవడంతో ఓ వల్‌ లో ఫైనల్‌ సాఫీగా సాగుతుందని భావిస్తున్నారు.  హాకీ సెమీస్‌లోనూ దాయాదులే..అదే లండన్‌లో దాయాదులు వరల్డ్‌ హాకీ లీగ్‌ టోర్నీలో ఢీకొననున్నాయి. శనివారం కెనడాతో తలపడనున్న భారత్‌.. ఆదివారం జరిగే పూల్‌-బి లీగ్‌ పోరులో పాకిస్థాన్‌ను ఎదుర్కోనుంది. ప్రస్తుత హాకీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్‌ది ఆరో స్థానంకాగా పాక్‌ 13లో ఉంది. ఈ టోర్నీనుంచి క్వాలిఫై అయ్యే జట్లు భువనేశ్వర్‌లో జరిగే వరల్డ్‌ హాకీ లీగ్‌ ఫైనల్లో ఆడతాయి. క్రికెట్‌ మాదిరి భారత్‌-పాక్‌ హాకీ పోటీ అంటే కూడా అభిమానులకు అదే ఉత్సాహం.. అదే ఉత్కంఠ..మొత్తంగా ఈ ఆదివారం దేశంలోని సింహభాగం ప్రజలు టీవీల చెంతనే! అటు కోహ్లీ సేనకు ఇటు మన్‌ప్రీత్‌ సింగ్‌ దళానికి ఆల్‌ ది బెస్ట్‌.
sports
5,149
17-03-2017 14:34:15
ఏటీఎం వర్కింగ్ రివ్యూ
నిర్మాణ సంస్థ:  డిజిక్వెస్ట్ ఇండియా లిమిటెడ్‌, శ్రావ్య ఫిలిమ్స్తారాగ‌ణం: ప‌వ‌న్‌, కారుణ్య‌, రాకేష్‌, మ‌హేంద్ర‌, నారాయ‌ణ‌, ఆషా, మ‌హేశ్‌, అంబ‌టి శీను, కిశోర్ దాస్, తిరుప‌తి దొరై, వీర‌బాబు, చిల్ల‌ర రాంబాబు, ఆంజ‌నేయులు త‌దిత‌రులుకూర్పు: శామ్యూల్ క‌ళ్యాణ్‌సంగీతం: ప్ర‌వీణ్ ఇమ్మ‌డిఛాయాగ్ర‌హ‌ణం: శివ‌రామ్ నిర్మాతలు: కిశోరి బ‌సిరెడ్డి, య‌క్క‌లి ర‌వీంద్ర బాబు ద‌ర్శ‌క‌త్వం: పి.సునీల్ కుమార్ రెడ్డి పెద్ద నోట్ల ర‌ద్దు వ్య‌వ‌హారం దేశంలో ఎవ‌రూ ఊహించ‌నిది. న‌రేంద్ర‌మోడీ పెద్ద నోట్ల ర‌ద్దు గురించి ప్ర‌క‌టించ‌గానే జ‌నాలంద‌రూ మిగిలిన అన్ని విష‌యాల‌నూ మ‌ర్చిపోయి ఏటీఎంల గురించి, చెల్లే నోట్ల గురించి, కొత్త‌గా బ్యాంకులు ఇచ్చిన రెండు వేల నోట్ల గురించి, న‌ల్లకుబేరుల గురించి, క‌మిష‌న్ల మార్పిడి గురించి, బంగారు కొనుగోలు గురించి, చిల్ల‌ర స‌మ‌స్య గురించి మాట్లాడుకోవ‌డం మొద‌లుపెట్టారు. స‌రిగా అదే స‌మ‌యంలో ఆ విష‌యాల‌ను గమ‌నించి సునీల్‌కుమార్ రెడ్డి ఆ ఇష్యూతో సినిమా చేసి `ఏటీఎం వ‌ర్కింగ్‌` అని సినిమా తీశారు. శ్రావ్య ఫిలిమ్స్ తెర‌కెక్కించిన టుమ్రీ సినిమాగా ఈ చిత్రానికి ప్ర‌చారం చేశారు. ఇంత‌కీ ఆ సినిమా ఎలా ఉంది? క‌రెంట్ ఎఫైర్‌తో వెండితెర‌మీద‌కు వచ్చి ఆక‌ట్టుకుందా?  లేదా?  అనేది తెలియాలంటే ఓ లుక్కేసేయండి మ‌రి... క‌థ‌:అనంత్ (ప‌వ‌న్‌), త్రిలోక్ ( రాకేష్‌), మ‌హేంద్ర (మ‌హేశ్‌) ముగ్గురూ స్నేహితులు. పెద్ద క‌ష్టాలేమీ ప‌డ‌కుండా చేతిలోకి డ‌బ్బులు రావాల‌నుకుని ఆలోచించే మ‌న‌స్త‌త్వం ఉన్న‌వారు. వారికి ప‌రిచ‌య‌మైన ఓ వ్య‌క్తి దొంగ‌నోట్ల వ్యాపారం గురించి చెబుతాడు. దాంతో ముగ్గురు స్నేహితులు క‌లిసి ఓ చోటా రౌడీని బ‌తిమాలుకుని రూ.2ల‌క్ష‌లు అప్పుచేసి దొంగ‌నోట్ల ముద్ర‌ణ‌కు ప్లాన్ చేస్తారు. క‌ష్ట‌ప‌డి మూడు కోట్ల రూపాయ‌ల‌ను ముద్రించి పార్టీ కోసం వెతుక్కుని డ‌బ్బు తీసుకుని వెళ్ల‌డానికి స‌ర్వం స‌న్నాహాలు చేసుకుంటారు. అనూహ్య‌మైన రీతిలో అదేరోజు నోట్ల ర‌ద్దు ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంది. అక్క‌డి నుంచి ఆ నోట్ల‌ను ఏం చేశారు? ఏటీఎం క్యూల‌లో వాళ్లు ఎలా నిలుచున్నారు?  చిల్ల‌ర దొర‌క్క వాళ్లు చేసిన ప‌నులేంటి? అస‌లు పెద్ద‌నోట్ల ర‌ద్దు వ్య‌వ‌హారం ఆ ముగ్గురి జీవితాల‌పై ఎలాంటి ప్ర‌భావాన్ని చూపింద‌నే అంశాలతో మిగిలిన క‌థ సాగుతుంది.  ప్ల‌స్ పాయింట్లుఆబాల‌గోపాలానికి ప‌రిచ‌య‌మైన పెద్ద‌నోట్ల ర‌ద్దును తెర‌పై చూపించారు. కాబ‌ట్టి సినిమా ఆద్యంతం వినోదాత్మ‌కంగా సాగిపోతుంటుంది. కొత్త‌వారైనా న‌టీన‌టులు చ‌క్క‌గా న‌టించారు. హీరోయిన్ కొన్ని యాంగిల్స్ లో ఫ‌ర్వాలేద‌నిపిస్తుంది. ర‌క్త‌దానం ఆవ‌శ్య‌క‌త‌, ఏటీఎం కార్డుల నెంబ‌ర్ల‌ను, పిన్నులను ఫోనుల్లో అప‌రిచితుల‌కు చెప్ప‌కూడ‌దు... వంటి అంశాలను ఇత‌రుల‌కు చెప్ప‌కూడ‌ద‌నే అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డం బావుంది. మైన‌స్ పాయింట్లుటీవీల్లో ఈ మ‌ధ్య మొత్తం ఊద‌ర‌గొట్టిన స‌మ‌స్య‌ల‌నే తెర‌పై చూసిన‌ట్టు అనిపించింది. డ‌బ్బున్న వారు వాటిని మార్చుకోవ‌డానికి ఎన్ని ర‌కాల తిప్ప‌లు ప‌డ్డారు?  బ్యాంకుల్లో మేనేజ‌ర్లు ఎలా వ్య‌వ‌హ‌రించారు? వ‌ంటి అంశాల గురించి ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన వార్త‌ల‌నే తెర‌పై చూసిన‌ట్టు అనిపించింది. ఉగ్ర‌వాదుల గురించి ఏం చెప్ప‌ద‌ల‌చుకున్నారో అర్థం కాదు. మ‌ధ్య‌మ‌ధ్య‌లో ఆ షాట్‌లు ఎందుకు ప‌డ‌తాయో అంత తేలిగ్గా అర్థం కాదు. కెమెరాప‌నిత‌నం మెప్పించ‌దు. ప్ర‌తి సంద‌ర్భంలోనూ క్లోజ‌ప్ షార్ట్ ల ఆవ‌శ్య‌క‌త ఏంటో అర్థం కాదు. సంగీతం విన‌సొంపుగా లేదు. క‌థ‌న‌మే నిదానంగా ఉంద‌నుకుంటున్న త‌రుణంలో పాట‌లు మ‌రింత చికాకు తెప్పిస్తాయి. విశ్లేష‌ణ‌సునీల్‌కుమార్‌రెడ్డికి సామాజిక కోణంలో సినిమా తీస్తార‌నే పేరు ఉంది. అంద‌రికీ తెలిసిన అంశాల‌నే తెర‌కెక్కించినా, అందులోనూ జ‌నాల‌కు అవ‌గాహ‌న క‌లిగించే విష‌యాల‌ను ఎక్కువ‌గా చొప్పించి చెబుతార‌నే పేరు ఉంది. కానీ ఎటీఎం వ‌ర్కింగ్ సినిమా విష‌యంలో ఆయ‌న త‌న‌కున్న పేరును పెద్ద‌గా ప‌ట్టించుకున్న‌ట్టు లేరు. బ్ల‌డ్ బ్యాంక్ వ్య‌వ‌హారాలు, పిన్ సీక్రెట్‌లు వంటివాటి గురించి చెప్పినా మిగిలిన అంశాల గురించి తేలిగ్గా వ‌దిలేసిన‌ట్టు అనిపిస్తుంది. ఏటీఎం క్యూలో నిలుచుని, ఒక సారి న‌వ్వుకుని, మ‌రో ఏటీఎంకి ఒకే బండిమీద వెళ్లినంత మాత్రాన ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ‌పుడుతుందా? ఈ సినిమాలో ఉన్న‌ట్టే చూపించారు ద‌ర్శ‌కుడు. మిగిలిన స‌న్నివేశాలు కూడా బ‌లంగా అనిపించ‌లేదు. హ‌డావిడిగా తీసి విడుద‌ల చేసేయాల‌నే ఆలోచ‌న‌తో కాకుండా, ఇదే అంశాన్ని ఇంకాస్త లోతుగా స్పృశించి తెర‌కెక్కించిన‌ట్ట‌యితే సునీల్‌కుమార్‌రెడ్డి బ్రాండ్‌ని నిలిపే సినిమానే అయి ఉండేదన‌డంలో అనుమానం లేదు.బాట‌మ్ లైన్:  సాగ‌దీత‌గా `ఏటీఎం వ‌ర్కింగ్‌`రేటింగ్‌: 2/5నిర్మాణ సంస్థ:  డిజిక్వెస్ట్ ఇండియా లిమిటెడ్‌, శ్రావ్య ఫిలిమ్స్తారాగ‌ణం: ప‌వ‌న్‌, కారుణ్య‌, రాకేష్‌, మ‌హేంద్ర‌, నారాయ‌ణ‌, ఆషా, మ‌హేశ్‌, అంబ‌టి శీను, కిశోర్ దాస్, తిరుప‌తి దొరై, వీర‌బాబు, చిల్ల‌ర రాంబాబు, ఆంజ‌నేయులు త‌దిత‌రులుకూర్పు: శామ్యూల్ క‌ళ్యాణ్‌సంగీతం: ప్ర‌వీణ్ ఇమ్మ‌డిఛాయాగ్ర‌హ‌ణం: శివ‌రామ్ నిర్మాతలు: కిశోరి బ‌సిరెడ్డి, య‌క్క‌లి ర‌వీంద్ర బాబు ద‌ర్శ‌క‌త్వం: పి.సునీల్ కుమార్ రెడ్డి పెద్ద నోట్ల ర‌ద్దు వ్య‌వ‌హారం దేశంలో ఎవ‌రూ ఊహించ‌నిది. న‌రేంద్ర‌మోడీ పెద్ద నోట్ల ర‌ద్దు గురించి ప్ర‌క‌టించ‌గానే జ‌నాలంద‌రూ మిగిలిన అన్ని విష‌యాల‌నూ మ‌ర్చిపోయి ఏటీఎంల గురించి, చెల్లే నోట్ల గురించి, కొత్త‌గా బ్యాంకులు ఇచ్చిన రెండు వేల నోట్ల గురించి, న‌ల్లకుబేరుల గురించి, క‌మిష‌న్ల మార్పిడి గురించి, బంగారు కొనుగోలు గురించి, చిల్ల‌ర స‌మ‌స్య గురించి మాట్లాడుకోవ‌డం మొద‌లుపెట్టారు. స‌రిగా అదే స‌మ‌యంలో ఆ విష‌యాల‌ను గమ‌నించి సునీల్‌కుమార్ రెడ్డి ఆ ఇష్యూతో సినిమా చేసి `ఏటీఎం వ‌ర్కింగ్‌` అని సినిమా తీశారు. శ్రావ్య ఫిలిమ్స్ తెర‌కెక్కించిన టుమ్రీ సినిమాగా ఈ చిత్రానికి ప్ర‌చారం చేశారు. ఇంత‌కీ ఆ సినిమా ఎలా ఉంది? క‌రెంట్ ఎఫైర్‌తో వెండితెర‌మీద‌కు వచ్చి ఆక‌ట్టుకుందా?  లేదా?  అనేది తెలియాలంటే ఓ లుక్కేసేయండి మ‌రి... క‌థ‌:అనంత్ (ప‌వ‌న్‌), త్రిలోక్ ( రాకేష్‌), మ‌హేంద్ర (మ‌హేశ్‌) ముగ్గురూ స్నేహితులు. పెద్ద క‌ష్టాలేమీ ప‌డ‌కుండా చేతిలోకి డ‌బ్బులు రావాల‌నుకుని ఆలోచించే మ‌న‌స్త‌త్వం ఉన్న‌వారు. వారికి ప‌రిచ‌య‌మైన ఓ వ్య‌క్తి దొంగ‌నోట్ల వ్యాపారం గురించి చెబుతాడు. దాంతో ముగ్గురు స్నేహితులు క‌లిసి ఓ చోటా రౌడీని బ‌తిమాలుకుని రూ.2ల‌క్ష‌లు అప్పుచేసి దొంగ‌నోట్ల ముద్ర‌ణ‌కు ప్లాన్ చేస్తారు. క‌ష్ట‌ప‌డి మూడు కోట్ల రూపాయ‌ల‌ను ముద్రించి పార్టీ కోసం వెతుక్కుని డ‌బ్బు తీసుకుని వెళ్ల‌డానికి స‌ర్వం స‌న్నాహాలు చేసుకుంటారు. అనూహ్య‌మైన రీతిలో అదేరోజు నోట్ల ర‌ద్దు ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంది. అక్క‌డి నుంచి ఆ నోట్ల‌ను ఏం చేశారు? ఏటీఎం క్యూల‌లో వాళ్లు ఎలా నిలుచున్నారు?  చిల్ల‌ర దొర‌క్క వాళ్లు చేసిన ప‌నులేంటి? అస‌లు పెద్ద‌నోట్ల ర‌ద్దు వ్య‌వ‌హారం ఆ ముగ్గురి జీవితాల‌పై ఎలాంటి ప్ర‌భావాన్ని చూపింద‌నే అంశాలతో మిగిలిన క‌థ సాగుతుంది.  ప్ల‌స్ పాయింట్లుఆబాల‌గోపాలానికి ప‌రిచ‌య‌మైన పెద్ద‌నోట్ల ర‌ద్దును తెర‌పై చూపించారు. కాబ‌ట్టి సినిమా ఆద్యంతం వినోదాత్మ‌కంగా సాగిపోతుంటుంది. కొత్త‌వారైనా న‌టీన‌టులు చ‌క్క‌గా న‌టించారు. హీరోయిన్ కొన్ని యాంగిల్స్ లో ఫ‌ర్వాలేద‌నిపిస్తుంది. ర‌క్త‌దానం ఆవ‌శ్య‌క‌త‌, ఏటీఎం కార్డుల నెంబ‌ర్ల‌ను, పిన్నులను ఫోనుల్లో అప‌రిచితుల‌కు చెప్ప‌కూడ‌దు... వంటి అంశాలను ఇత‌రుల‌కు చెప్ప‌కూడ‌ద‌నే అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డం బావుంది. మైన‌స్ పాయింట్లుటీవీల్లో ఈ మ‌ధ్య మొత్తం ఊద‌ర‌గొట్టిన స‌మ‌స్య‌ల‌నే తెర‌పై చూసిన‌ట్టు అనిపించింది. డ‌బ్బున్న వారు వాటిని మార్చుకోవ‌డానికి ఎన్ని ర‌కాల తిప్ప‌లు ప‌డ్డారు?  బ్యాంకుల్లో మేనేజ‌ర్లు ఎలా వ్య‌వ‌హ‌రించారు? వ‌ంటి అంశాల గురించి ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన వార్త‌ల‌నే తెర‌పై చూసిన‌ట్టు అనిపించింది. ఉగ్ర‌వాదుల గురించి ఏం చెప్ప‌ద‌ల‌చుకున్నారో అర్థం కాదు. మ‌ధ్య‌మ‌ధ్య‌లో ఆ షాట్‌లు ఎందుకు ప‌డ‌తాయో అంత తేలిగ్గా అర్థం కాదు. కెమెరాప‌నిత‌నం మెప్పించ‌దు. ప్ర‌తి సంద‌ర్భంలోనూ క్లోజ‌ప్ షార్ట్ ల ఆవ‌శ్య‌క‌త ఏంటో అర్థం కాదు. సంగీతం విన‌సొంపుగా లేదు. క‌థ‌న‌మే నిదానంగా ఉంద‌నుకుంటున్న త‌రుణంలో పాట‌లు మ‌రింత చికాకు తెప్పిస్తాయి. విశ్లేష‌ణ‌సునీల్‌కుమార్‌రెడ్డికి సామాజిక కోణంలో సినిమా తీస్తార‌నే పేరు ఉంది. అంద‌రికీ తెలిసిన అంశాల‌నే తెర‌కెక్కించినా, అందులోనూ జ‌నాల‌కు అవ‌గాహ‌న క‌లిగించే విష‌యాల‌ను ఎక్కువ‌గా చొప్పించి చెబుతార‌నే పేరు ఉంది. కానీ ఎటీఎం వ‌ర్కింగ్ సినిమా విష‌యంలో ఆయ‌న త‌న‌కున్న పేరును పెద్ద‌గా ప‌ట్టించుకున్న‌ట్టు లేరు. బ్ల‌డ్ బ్యాంక్ వ్య‌వ‌హారాలు, పిన్ సీక్రెట్‌లు వంటివాటి గురించి చెప్పినా మిగిలిన అంశాల గురించి తేలిగ్గా వ‌దిలేసిన‌ట్టు అనిపిస్తుంది. ఏటీఎం క్యూలో నిలుచుని, ఒక సారి న‌వ్వుకుని, మ‌రో ఏటీఎంకి ఒకే బండిమీద వెళ్లినంత మాత్రాన ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ‌పుడుతుందా? ఈ సినిమాలో ఉన్న‌ట్టే చూపించారు ద‌ర్శ‌కుడు. మిగిలిన స‌న్నివేశాలు కూడా బ‌లంగా అనిపించ‌లేదు. హ‌డావిడిగా తీసి విడుద‌ల చేసేయాల‌నే ఆలోచ‌న‌తో కాకుండా, ఇదే అంశాన్ని ఇంకాస్త లోతుగా స్పృశించి తెర‌కెక్కించిన‌ట్ట‌యితే సునీల్‌కుమార్‌రెడ్డి బ్రాండ్‌ని నిలిపే సినిమానే అయి ఉండేదన‌డంలో అనుమానం లేదు.బాట‌మ్ లైన్:  సాగ‌దీత‌గా `ఏటీఎం వ‌ర్కింగ్‌`రేటింగ్‌: 2/5నిర్మాణ సంస్థ:  డిజిక్వెస్ట్ ఇండియా లిమిటెడ్‌, శ్రావ్య ఫిలిమ్స్తారాగ‌ణం: ప‌వ‌న్‌, కారుణ్య‌, రాకేష్‌, మ‌హేంద్ర‌, నారాయ‌ణ‌, ఆషా, మ‌హేశ్‌, అంబ‌టి శీను, కిశోర్ దాస్, తిరుప‌తి దొరై, వీర‌బాబు, చిల్ల‌ర రాంబాబు, ఆంజ‌నేయులు త‌దిత‌రులుకూర్పు: శామ్యూల్ క‌ళ్యాణ్‌సంగీతం: ప్ర‌వీణ్ ఇమ్మ‌డిఛాయాగ్ర‌హ‌ణం: శివ‌రామ్ నిర్మాతలు: కిశోరి బ‌సిరెడ్డి, య‌క్క‌లి ర‌వీంద్ర బాబు ద‌ర్శ‌క‌త్వం: పి.సునీల్ కుమార్ రెడ్డి పెద్ద నోట్ల ర‌ద్దు వ్య‌వ‌హారం దేశంలో ఎవ‌రూ ఊహించ‌నిది. న‌రేంద్ర‌మోడీ పెద్ద నోట్ల ర‌ద్దు గురించి ప్ర‌క‌టించ‌గానే జ‌నాలంద‌రూ మిగిలిన అన్ని విష‌యాల‌నూ మ‌ర్చిపోయి ఏటీఎంల గురించి, చెల్లే నోట్ల గురించి, కొత్త‌గా బ్యాంకులు ఇచ్చిన రెండు వేల నోట్ల గురించి, న‌ల్లకుబేరుల గురించి, క‌మిష‌న్ల మార్పిడి గురించి, బంగారు కొనుగోలు గురించి, చిల్ల‌ర స‌మ‌స్య గురించి మాట్లాడుకోవ‌డం మొద‌లుపెట్టారు. స‌రిగా అదే స‌మ‌యంలో ఆ విష‌యాల‌ను గమ‌నించి సునీల్‌కుమార్ రెడ్డి ఆ ఇష్యూతో సినిమా చేసి `ఏటీఎం వ‌ర్కింగ్‌` అని సినిమా తీశారు. శ్రావ్య ఫిలిమ్స్ తెర‌కెక్కించిన టుమ్రీ సినిమాగా ఈ చిత్రానికి ప్ర‌చారం చేశారు. ఇంత‌కీ ఆ సినిమా ఎలా ఉంది? క‌రెంట్ ఎఫైర్‌తో వెండితెర‌మీద‌కు వచ్చి ఆక‌ట్టుకుందా?  లేదా?  అనేది తెలియాలంటే ఓ లుక్కేసేయండి మ‌రి... క‌థ‌:అనంత్ (ప‌వ‌న్‌), త్రిలోక్ ( రాకేష్‌), మ‌హేంద్ర (మ‌హేశ్‌) ముగ్గురూ స్నేహితులు. పెద్ద క‌ష్టాలేమీ ప‌డ‌కుండా చేతిలోకి డ‌బ్బులు రావాల‌నుకుని ఆలోచించే మ‌న‌స్త‌త్వం ఉన్న‌వారు. వారికి ప‌రిచ‌య‌మైన ఓ వ్య‌క్తి దొంగ‌నోట్ల వ్యాపారం గురించి చెబుతాడు. దాంతో ముగ్గురు స్నేహితులు క‌లిసి ఓ చోటా రౌడీని బ‌తిమాలుకుని రూ.2ల‌క్ష‌లు అప్పుచేసి దొంగ‌నోట్ల ముద్ర‌ణ‌కు ప్లాన్ చేస్తారు. క‌ష్ట‌ప‌డి మూడు కోట్ల రూపాయ‌ల‌ను ముద్రించి పార్టీ కోసం వెతుక్కుని డ‌బ్బు తీసుకుని వెళ్ల‌డానికి స‌ర్వం స‌న్నాహాలు చేసుకుంటారు. అనూహ్య‌మైన రీతిలో అదేరోజు నోట్ల ర‌ద్దు ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంది. అక్క‌డి నుంచి ఆ నోట్ల‌ను ఏం చేశారు? ఏటీఎం క్యూల‌లో వాళ్లు ఎలా నిలుచున్నారు?  చిల్ల‌ర దొర‌క్క వాళ్లు చేసిన ప‌నులేంటి? అస‌లు పెద్ద‌నోట్ల ర‌ద్దు వ్య‌వ‌హారం ఆ ముగ్గురి జీవితాల‌పై ఎలాంటి ప్ర‌భావాన్ని చూపింద‌నే అంశాలతో మిగిలిన క‌థ సాగుతుంది.  ప్ల‌స్ పాయింట్లుఆబాల‌గోపాలానికి ప‌రిచ‌య‌మైన పెద్ద‌నోట్ల ర‌ద్దును తెర‌పై చూపించారు. కాబ‌ట్టి సినిమా ఆద్యంతం వినోదాత్మ‌కంగా సాగిపోతుంటుంది. కొత్త‌వారైనా న‌టీన‌టులు చ‌క్క‌గా న‌టించారు. హీరోయిన్ కొన్ని యాంగిల్స్ లో ఫ‌ర్వాలేద‌నిపిస్తుంది. ర‌క్త‌దానం ఆవ‌శ్య‌క‌త‌, ఏటీఎం కార్డుల నెంబ‌ర్ల‌ను, పిన్నులను ఫోనుల్లో అప‌రిచితుల‌కు చెప్ప‌కూడ‌దు... వంటి అంశాలను ఇత‌రుల‌కు చెప్ప‌కూడ‌ద‌నే అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డం బావుంది. మైన‌స్ పాయింట్లుటీవీల్లో ఈ మ‌ధ్య మొత్తం ఊద‌ర‌గొట్టిన స‌మ‌స్య‌ల‌నే తెర‌పై చూసిన‌ట్టు అనిపించింది. డ‌బ్బున్న వారు వాటిని మార్చుకోవ‌డానికి ఎన్ని ర‌కాల తిప్ప‌లు ప‌డ్డారు?  బ్యాంకుల్లో మేనేజ‌ర్లు ఎలా వ్య‌వ‌హ‌రించారు? వ‌ంటి అంశాల గురించి ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన వార్త‌ల‌నే తెర‌పై చూసిన‌ట్టు అనిపించింది. ఉగ్ర‌వాదుల గురించి ఏం చెప్ప‌ద‌ల‌చుకున్నారో అర్థం కాదు. మ‌ధ్య‌మ‌ధ్య‌లో ఆ షాట్‌లు ఎందుకు ప‌డ‌తాయో అంత తేలిగ్గా అర్థం కాదు. కెమెరాప‌నిత‌నం మెప్పించ‌దు. ప్ర‌తి సంద‌ర్భంలోనూ క్లోజ‌ప్ షార్ట్ ల ఆవ‌శ్య‌క‌త ఏంటో అర్థం కాదు. సంగీతం విన‌సొంపుగా లేదు. క‌థ‌న‌మే నిదానంగా ఉంద‌నుకుంటున్న త‌రుణంలో పాట‌లు మ‌రింత చికాకు తెప్పిస్తాయి. విశ్లేష‌ణ‌సునీల్‌కుమార్‌రెడ్డికి సామాజిక కోణంలో సినిమా తీస్తార‌నే పేరు ఉంది. అంద‌రికీ తెలిసిన అంశాల‌నే తెర‌కెక్కించినా, అందులోనూ జ‌నాల‌కు అవ‌గాహ‌న క‌లిగించే విష‌యాల‌ను ఎక్కువ‌గా చొప్పించి చెబుతార‌నే పేరు ఉంది. కానీ ఎటీఎం వ‌ర్కింగ్ సినిమా విష‌యంలో ఆయ‌న త‌న‌కున్న పేరును పెద్ద‌గా ప‌ట్టించుకున్న‌ట్టు లేరు. బ్ల‌డ్ బ్యాంక్ వ్య‌వ‌హారాలు, పిన్ సీక్రెట్‌లు వంటివాటి గురించి చెప్పినా మిగిలిన అంశాల గురించి తేలిగ్గా వ‌దిలేసిన‌ట్టు అనిపిస్తుంది. ఏటీఎం క్యూలో నిలుచుని, ఒక సారి న‌వ్వుకుని, మ‌రో ఏటీఎంకి ఒకే బండిమీద వెళ్లినంత మాత్రాన ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ‌పుడుతుందా? ఈ సినిమాలో ఉన్న‌ట్టే చూపించారు ద‌ర్శ‌కుడు. మిగిలిన స‌న్నివేశాలు కూడా బ‌లంగా అనిపించ‌లేదు. హ‌డావిడిగా తీసి విడుద‌ల చేసేయాల‌నే ఆలోచ‌న‌తో కాకుండా, ఇదే అంశాన్ని ఇంకాస్త లోతుగా స్పృశించి తెర‌కెక్కించిన‌ట్ట‌యితే సునీల్‌కుమార్‌రెడ్డి బ్రాండ్‌ని నిలిపే సినిమానే అయి ఉండేదన‌డంలో అనుమానం లేదు.బాట‌మ్ లైన్:  సాగ‌దీత‌గా `ఏటీఎం వ‌ర్కింగ్‌`రేటింగ్‌: 2/5
entertainment
12,151
02-10-2017 01:28:39
గీత తల్లిదండ్రుల ఆచూకీ చెబితే లక్ష: సుష్మా
న్యూఢిల్లీ: బధిర యువతి గీతను తల్లిదండ్రుల చెంతకు చేర్చిన వారికి రూ.లక్ష నగదు అందజేస్తామని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ ప్రకటించారు. భారత్‌కు చెందిన గీతను పదిహేనేళ్ల క్రితం లాహోర్‌లో ఆగి ఉన్న సంఝౌతా ఎక్స్‌ప్రె్‌సలో పాకిస్తాన్‌ సైనికులు గుర్తించారు. ప్రభుత్వం చొరవతో 2015లో భారత్‌లో అడుగుపెట్టిన గీత ఇప్పటికీ తల్లిదండ్రులను చేరుకోలేకపోయింది.
nation
20,275
20-01-2017 18:08:43
యువీ గురించి సెహ్వాగ్ ఉద్వేగభరిత ట్వీట్
న్యూఢిల్లీ : కటక్‌ వన్డేలో శతకంన్నర కొట్టిన యువరాజ్ సింగ్ గురించి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఉద్వేగభరితమైన ట్వీట్ చేశాడు. ‘అతను క్యాన్సర్‌ను ఓడించాడు. ఇవాళ ఇంగ్లండ్ బౌలర్లను మాత్రమే ఓడించాడు. నిరాశ చెందకూడదని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల’ని వీరూ అన్నాడు. క్యాన్సర్‌తో యువీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పటి ఫొటో కూడా సెహ్వాగ్ పోస్ట్ చేశాడు. 2011 ప్రపంచ కప్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్న యువరాజ్.. అదే ఏడాది క్యాన్సర్ బారినపడ్డాడు. ఆ వ్యాధితో పోరాడి జయించి.. మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. 35 ఏళ్ల యువీకి పలు అవకాశాలు వచ్చినా రాణించలేకపోయాడు. చివరకు రంజీలో తన ఫామ్‌ను, ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడంతో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ద‌ష్ట్యా చివరిదన్నట్లు ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఓ అవకాశం ఇచ్చారు. కటక్‌లో సింగ్ ఈజ్ కింగ్ అనిపించుకున్నాడు.
sports
21,177
25-02-2017 01:40:49
తెల్ల గడ్డం తళతళ..
తళతళ మెరిసే తెల్ల గడ్డంతో ఉన్న ఈ వ్యక్తి టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనీ. విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా కోల్‌కతా వేదికగా జార్ఖండ్‌-కర్ణాటక జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌ సందర్భంగా మహీ ఇలా పూర్తిగా నెరిసిన గడ్డంతో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
sports
20,847
27-01-2017 21:15:14
అనుకున్నట్టే జరిగింది : కేదార్ జాదవ్
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ తన క్రికెట్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని కేదార్ జాదవ్ అన్నాడు. ఈ సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవడంపై మీడియాతో మాట్లాడుతూ.. తాను మొదటి వన్డే తర్వాతనే దీన్ని ఊహించానని చెప్పాడు. ఇలానే తన ప్రదర్శన కొనసాగిస్తే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవడం తేలికేనని ఫస్ట్ వన్డే తర్వాత అనుకున్నట్టు తెలిపాడు. ఓడిపోతుందనుకున్న పరిస్థితిలో కేదార్ ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగి అద్భుతంగా 76 బంతుల్లోనే 120 పరుగులు చేసి గెలిపించాడు. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో తనకు పూర్తిగా ఆత్మ విశ్వాసం ఏర్పడిందని, ఏ ఆటగాడికైనా అలాంటి విశ్వాసం చాలా ముఖ్యమని చెప్పాడు. తానింకా కొన్ని సిరీస్‌ల వరకూ ఖచ్చితంగా టీంలో ఉండగలనని ఆత్మ విశ్వాసం వ్యక్తపరిచాడు కేదార్ జాదవ్.
sports
7,900
02-05-2017 11:02:49
బాహుబలి-2లో ఐదు త‌ప్పులున్నాయి: ద‌ర్శ‌కుడు విఘ్నేష్
గ‌త నెల 28న విడుద‌లైన బాహుబ‌లి-2 సినిమా సంచ‌ల‌నం సృష్టించే దిశ‌గా దూసుకుపోతోంది. అక్క‌డ‌క్క‌డ కొన్ని విమ‌ర్శలు ఎదుర‌వుతున్నా మెజారిటీ జ‌నాలు మాత్రం బాహుబ‌లి-2ను ఆద‌రిస్తున్నారు. సినీ ప్ర‌ముఖులు కూడా బాహుబ‌లి-2ను, ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు. కాగా, త‌మిళ ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్ బాహుబ‌లి-2లోని ఐదు త‌ప్పుల‌ను ప‌సిగ‌ట్టి వాటిని సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించాడు. అవేంటో చూద్దాం.. 1) బాహుబ‌లి-2 సినిమాను కేవ‌లం 120 రూపాయ‌ల‌కే చూడాల్సి రావ‌డం మొద‌టి త‌ప్పు. అందుకు ప్ర‌తిగా నిర్మాత కోసం ప్ర‌తీ థియేట‌ర్ ద‌గ్గ‌రా ఓ క‌లెక్ష‌న్ బాక్స్‌ను ఏర్పాటు చేయాలి. 2) సినిమా ర‌న్‌టైం చాలా త‌క్కువ‌గా ఉంది. కేవ‌లం మూడు గంట‌ల్లోనే సినిమా పూర్త‌యిపోవ‌డాన్ని ఎవ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు.  3) ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఇదే చివ‌రి సినిమా అవ‌డానికి వీల్లేదు. ఈ సిరీస్‌లో మ‌రో ప‌ది సినిమాల‌ను చూడాల‌నుకుంటున్నాం.  4) టూ మ‌చ్ డిటెయిలింగ్ అండ్ ప‌ర్‌ఫెక్ష‌న్‌. ఈ దెబ్బ‌తో తాము గొప్ప‌వాళ్ల‌మ‌ని విర్ర‌వీగే ద‌ర్శ‌కులంద‌రూ త‌మ హెడ్ వెయిట్‌ను త‌గ్గించుకోవాల్సి ఉంటుంది.  5) బెంచ్‌మార్క్‌ను సెట్ చేయ‌డం చాలా క‌ష్టం. ఈ రికార్డుల‌ను అధిగ‌మించాలంటే చాలా ఏళ్లు ప‌డుతుంది. ఇవీ సోష‌ల్ మీడియాలో బాహుబ‌లి-2లోని త‌ప్పులంటూ విఘ్నేష్ శివ‌న్ రాసిన‌వి. నిజానికి త‌ప్పుల‌ను ఎత్తిచూపుతున్నాన‌ని చెప్పాడు గానీ, ప‌రోక్షంగా రాజ‌మౌళికి హ్యాట్సాఫ్ చెప్పాడు. బాహుబ‌లి-2 చూసి అంద‌రూ రాజ‌మౌళిని ఆకాశానికి ఎత్తేస్తున్న నేప‌థ్యంలో విఘ్నేష్ ఇలా క్రియేటివ్‌గా త‌న ప్ర‌శంస‌ల‌ను అందించాడ‌న్న‌మాట‌.
entertainment
17,425
03-07-2017 18:30:05
ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం
న్యూఢిల్లీ: ఇజ్రయెల్ పర్యటనకు వెళ్తున్న తొలి భారత ప్రధానిగా ఇప్పటికే ప్రత్యేక ఘనత అందుకున్న నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కనుంది. ఇజ్రయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్వయంగా ప్రధాని మోదీని రిసీవ్ చేసుకోనున్నారు. మంగళవారం మధ్యాహ్నం బెన్ గురియన్ విమానాశ్రయంలో ఆయన మోదీకి ఎదురేగి స్వాగతం పలకనున్నారు. ఇప్పటివరకు కేవలం అమెరికా అధ్యక్షులు మాత్రమే ఈ ప్రత్యేక గౌరవం అందుకున్నారు. ఇటీవల ఇజ్రాయెల్ సందర్శించిన డొనాల్డ్ ట్రంప్, పోప్‌లకు మాత్రమే ఈ తరహా రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. మరోవైపు మోదీ చారిత్రాత్మక పర్యటన ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇజ్రాయెల్ ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు సిద్ధం చేసింది. మూడు రోజుల పర్యటనలో నెతన్యాహు మోదీతోపాటే వెన్నంటి ఉంటారనీ... ఆయనకు తోడుగా ఉంటూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారని ఇజ్రాయెల్ విదేశాంగ ప్రతినిధి యువాల్ రోటెమ్ వెల్లడించారు. ఇలాంటి సంప్రదాయం ఇంతకు ముందు ఏ దేశం ప్రధానితోనూ అనుసరించలేదని పేర్కొన్నారు. మోదీ పర్యటకు తాము ఇస్తున్న ప్రాధాన్యతలో ఇదికూడా ఓ భాగమన్నారు. సాధారణంగా నెతన్యాహు ఇజ్రయెల్ వచ్చిన దేశాధినేతలతో కేవలం ఒక్క సమావేశంలో మాత్రమే పాల్గొంటారు. అదికూడా డిన్నర్, లంచ్ సమయాల్లో మాత్రమే భేటీ అవుతారు. అలాంటిది ఇప్పుడు ప్రధాని మోదీకి ఆయన విశిష్ట ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం.
nation
20,211
19-12-2017 01:11:51
నాయర్‌ అజేయ శతకం
పటిష్ఠ స్థితిలో కర్ణాటక కోల్‌కతా: కరుణ్‌ నాయర్‌ (148 బ్యాటింగ్‌) అజేయ శతకంతో రాణించడంతో.. విదర్భతో రంజీ సెమీస్‌లో కర్ణాటక పటిష్ఠ స్థితిలో నిలిచింది. ఓవర్‌ నైట్‌ స్కోరు 36/3తో రెండో రోజైన సోమవారం ఆటను కొనసాగించిన కర్ణాటక.. వెలుతురు లేమి కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి 294/8 స్కోరు చేసింది. నాయర్‌తోపాటు కెప్టెన్‌ వినయ్‌ కుమార్‌ (20) క్రీజులో ఉన్నారు. విదర్భ తొలి ఇన్నింగ్స్‌ స్కోరు 185కు కర్ణాటక 109 పరుగుల ఆధిక్యం సాధించింది. ముందు రోజు ఆటలో తడబడిన కర్ణాటక.. రెండోరోజు నింపాదిగా ఆడింది. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌ నాయర్‌, చిదంబరం గౌతమ్‌ (73) విదర్భ బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును నడిపించారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 139 పరుగులు జోడించారు. అయితే అర్ధ శతకం సాధించిన గౌతమ్‌ను ఉమేష్‌ యాదవ్‌ (2/71) అవుట్‌ చేసి బ్రేక్‌ ఇచ్చాడు. ఇక గుర్బానీ లోయర్‌ ఆర్డర్‌ పనిబట్టాడు. బిన్నీ (4), గోపాల్‌ (7), కృష్ణప్ప గౌతమ్‌ (1)ను అవుట్‌ చేసిన గుర్బానీ (5/90) సీజన్‌లో మరోసారి ఐదు వికెట్లు సాధించాడు. నాయర్‌ మాత్రం అజేయంగా రోజంతా బ్యాటింగ్‌ చేశాడు. గంభీర్‌, చండేలా సెంచరీల మోతగౌతమ్‌ గంభీర్‌ (127), కునాల్‌ చండేలా (113) శతకాలతో అదరగొట్టడంతో.. బెంగాల్‌తో రంజీ సెమీస్‌ మ్యాచ్‌లో ఢిల్లీ భారీస్కోరు దిశగా సాగు తోంది. బెంగాల్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న ఢిల్లీ.. రెండోరోజు ఆటముగిసేరికి తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఓపెనర్లు చండేలా, గంభీర్‌ శుభారంభాన్ని అందిం చారు. ఎంతో అలవోకగా బ్యాటింగ్‌ చేసిన గంభీర్‌ ఈ క్రమంలో 42వ ఫస్ట్‌ క్లాస్‌ శతకాన్ని సాధించా డు. అంతకుముందు ఓవర్‌ నైట్‌ స్కోరు 269/7తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన బెంగాల్‌.. మరో 17 పరుగులు మాత్రమే జత చేసి మిగతా మూడు వికెట్లు చేజార్చుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్‌ 286 పరుగులకు పరిమితమైంది.
sports
9,688
09-01-2017 19:18:29
చిరు, బాలయ్య సినిమాలపై స్పందించిన వెంకటేష్
ఈసారి చిరు, బాలయ్య సినిమాలతో సంక్రాంతి అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఎవరి నోట విన్నా ఈ రెండు సినిమాల గురించి ప్రస్తావనే. ఇప్పటికే ఈ సినిమాల విడుదలకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. అభిమానులు కూడా సినిమా విడుదలకు ముందు చేసే కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎంతో మంది అభిమానుల వలే తాను కూడా ఈ రెండు సినిమాల కోసం ఎదురు చూస్తున్నానన్నారు విక్టరీ వెంకటేష్. తన తోటి నటుల చిత్రాలపై స్పందించిన వెంకీ.. వారికి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి కానుకగా కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిరు, బాలకృష్ణ సినిమాలపై సినీ నటుడు విక్టరీ వెంకటేష్ స్పందించారు. ‘ఖైదీ నెం 150’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాల హీరోలు చిరంజీవి, బాలకృష్ణకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి, బాలకృష్ణతో కలిసి దిగిన పాత ఫోటోను పోస్ట్ చేసిన వెంకీ.. ‘‘ఇద్దరు గొప్ప నటులు, నా స్నేహితులు బాలకృష్ణ, చిరంజీవి సినిమాల కోసం ఎంతగానో వేచి చూస్తున్నా. ఈ రెండు సినిమాల వల్ల ఈసారి సంక్రాంతి ఘనంగా జరగబోతుంది. వీరిద్దరిని స్క్రీన్ మీద చూడడానికి తహతహలాడుతున్నా. ఈ రెండు సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నా. ఈ సందర్భంగా రెండు సినిమాల చిత్ర బృందాలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’’ అన్నారు. ఈనెల 11న చిరు ‘ఖైదీ నెం 150’, 12న బాలయ్య ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ విడుదల అవనున్న విషయం తెలిసిందే.
entertainment
11,185
11-05-2017 01:56:46
సబ్జెక్ట్‌ నిపుణులే తేలుస్తారు!
నీట్‌ ప్రశ్నపత్రంలో తప్పులపై సీబీఎస్ఈ.. పేపర్‌ లీక్‌ కేసులో కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడి అరెస్టున్యూఢిల్లీ/షేక్‌పురా, మే 10: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్‌) ప్రశ్నపత్రంలో తప్పులు దొర్లాయంటూ అభ్యర్థులు, విద్యానిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్ఈ) ఈ అంశంపై బుధవారం స్పష్టత ఇచ్చింది. ప్రశ్నలకు సంబంధించి సందిగ్ధత ఉంటే సబ్జెక్ట్‌ నిపుణులు తేలుస్తారని తెలిపింది. ఈ నెల 7న జరిగిన నీట్‌లో తప్పు ప్రశ్నలు నాలుగు వరకు ఉన్నాయంటూ పలువురు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఒక ప్రశ్నకు రెండు ఆప్షన్లు కరెక్టుగా ఉన్నాయని, మరొక ప్రశ్నకు ఇచ్చిన నాలుగు సమాధానాలూ తప్పేనని నిపుణులు పేర్కొన్నారు. ప్రశ్నలపై అభ్యంతరాలు, సందేహాలను సబ్జెక్టు నిపుణులకు అప్పగిస్తామని సీబీఎ్‌సఈ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఇందుకోసం ఆన్సర్‌ కీని అధికారికంగా వెబ్‌సైట్‌లో ఉంచుతామని, అప్పుడు అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలపొచ్చని వివరించారు. కాగా, నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ కేసులో బిహార్‌లో షేక్‌పురా జిల్లాలోని కోచింగ్‌ సంస్థ నిర్వాహకుడు చందన్‌కుమార్‌ అలియాస్‌ లల్లూని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
nation
17,254
23-10-2017 16:04:14
జపాన్ పార్లమెంట్ ఎన్నికల్లో షింజో అబే ప్రభంజనం
న్యూ ఢిల్లీ: జపాన్ అధికార పీఠాన్ని షింజో అబే మరోసారి కైవసం చేసుకున్నారు. జపాన్‌లో తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన నాయకత్వంలోని లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ, మరోపార్టీతో కూడిన సంకీర్ణ కూటమి తిరుగులేని విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో లిబర్ డెమోక్రాటిక్ పార్టీ కూటమీ 312 సీట్లు గెలుచుకుంది. దీంతో జపాన్‌లో షింజో అబే నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకానుంది. జపాన్ పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 465 స్థానాలు ఉన్నాయి. లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ అందులో 312 స్థానాలు గెలుచుకుంది. మేజిక్ ఫిగర్ 310ని లిబర్ డెమోక్రాటిక్ పార్టీ దాటేసి.. రెండింట మూడొంతుల స్థానాలను కైవసం చేసుకుంది. మరో నాలుగు స్థానాల ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. ఎన్నికల్లో లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ విజయం సాధించడంపై షింజో అబే హర్షం వ్యక్తం చేశారు. జపాన్ ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతామని చెప్పారు. రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణాన్ని తగ్గించి, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని తెలిపారు. ఉత్తర కొరియా అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కూలంకశంగా చర్చిస్తామన్నారు. జపాన్ ప్రధానిగా మరోసారి బాధ్యతలు చేపట్టనున్న షింజో అబేకు పలు దేశాల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. జపాన్ దేశంలో షింజో అబే విక్టరీ సాధించడంతో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. జపాన్ స్టాక్ మార్కెట్లో నిక్కీ 225 పాయింట్లు పెరిగింది. కొనుగోలు దారుల ఉత్సాహం కారణంగా నిక్కీ 21,670 పాయింట్లకు పెరిగిందని ఆర్థిక నిపుణులు తెలిపారు.
nation
6,092
25-11-2017 21:23:21
'భాగ్యనగరం' డ్రగ్స్‌పై సినిమా
కన్నడలో హిట్‌గా నిలిచిన 'రాజధాని' చిత్రాన్ని తెలుగులో సంతోష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై యువ నిర్మాత సంతోష్‌ కుమార్‌ 'భాగ్యనగరం' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో రిలీజ్‌కి రెడీ అవుతోంది. కన్నడ బిగ్‌స్టార్‌ అయిన యష్‌ ఈ చిత్రంలో హీరోగా నటించారు. షీలా హీరోయిన్‌గా నటించింది. వెర్సటైల్‌ యాక్టర్‌ ప్రకాష్‌ రాజ్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్రని పోషించారు. ముమైత్‌ఖాన్‌ మరో ముఖ్య పాత్రలో నటించింది. నిర్మాత సంతోష్‌ కుమార్‌ మాట్లాడుతూ - ''డ్రగ్స్‌ అండ్‌ డ్రింకింగ్ వలన పెడదారి పట్టిన నలుగురు యువకుల కథే 'భాగ్యనగరం'. మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటూ ప్రాణాలు కోల్పోతున్న యువతీ, యువకులందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రం ఇది. మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో మంచి సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రకాష్‌రాజ్‌, హీరో యష్‌ల మధ్య సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయి. అలాగే కథ, కథనం చాలా కొత్తగా వుంటుంది. దర్శకుడు కె.వి.రాజు చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని రూపొందించాడు. అర్జున్‌ జన్య మ్యూజిక్‌ సినిమాకి ఒన్‌ ఆఫ్‌ ది ఎస్సెట్‌గా నిలిచింది. సినిమా చూశాక ఒక గొప్ప చిత్రం చూశామనే ఫీలింగ్‌ కలుగుతుంది. నిర్మాతగా ఇది నా తొలి చిత్రం. భాగ్యనగరంలాంటి ఒక మంచి సందేశాత్మక చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నాను. అకున్‌ సబర్వాల్‌గారు ఈ సినిమా ట్రైలర్‌ చూసి చాలా అద్భుతంగా వుంది. ఇలాంటి చిత్రాలు ఎన్నో రావాలి అని అప్రిషియేట్‌ చేశారు. త్వరలో ఆయన ట్రైలర్‌ లాంచ్‌ చేయనున్నారు'' అన్నారు.
entertainment
1,218
07-06-2017 01:01:29
ఎయిటెల్‌, టెలినార్‌ విలీనానికి ఆమోదం
న్యూఢిల్లీ: టెలికాం రంగంలోని టెలినార్‌ ఇండియాను విలీనం చేసుకునేందుకు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆమోదం తెలిపిందని ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. ఈ రెండు కంపెనీలు విలీనం కోసం ఈ నెల ఫిబ్రవరిలో ఒక ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌, మహారాష్ట్ర, గుజరాత, యుపి (ఈస్ట్‌), పశ్చిమబెంగాల్‌ (వెస్ట్‌), అస్సాం సర్కిళ్ళు టెలినార్‌ ఇండియా చేతిలో ఉన్నాయి.
business
14,796
24-06-2017 09:35:25
100 మందిని మింగిన కొండచరియలు
బీజింగ్: చైనాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వరదలు సంభవిస్తున్నాయి. ఫ్రావిన్స్‌లో భారీ స్థాయిలో కొండచరియలు విరిగి పడుతున్నాయి. దీంతో 100 మంది వరకూ మరణించారని తెలుస్తోంది. జన్మో గ్రామంలో ఓ పర్వతంలోని చాలా భాగం కూలిపోవడంతో సమీపంలోని 40 గృహాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అలాగే మయోక్సియన్ కౌంటీలో కూడా కొండచరియలు విరిగి పడుతున్నాయి. ఇటీవలి కాలంలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడడం సర్వసాధారణంగా మారిపోయింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
nation
15,343
16-08-2017 02:54:17
గ్వామ్‌లో మోగిన ప్రమాద ఘంటికలు!
భయంతో పోలీసులకు ఫోన్లు చేసిన ద్వీపవాసులుఅవి పొరబాటు హెచ్చరికలేనని తర్వాత వెల్లడిఇప్పుడే దాడులు చేయబోనన్న కిమ్‌హగట్నా (గ్వామ్‌), ఆగస్టు 15: అది.. అసలే ఉత్తరకొరియా అణుక్షిపణులకు అందేంత దూరంలో ఉన్న గ్వామ్‌ ద్వీపం. అమెరికా నౌకా, వైమానిక దళ స్థావరాలున్న ఆ ద్వీపం మీద ‘ఇహనో ఇప్పుడో ఆ ద్వీపం మీద మేం బాంబులు వేసేస్తాం’ అంటూ ఉత్తరకొరియా పదేపదే హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇలాంటి తరుణంలో.. సోమవారం అర్ధరాత్రి దాటాక 12.25 సమయంలో.. రెండు రేడియో స్టేషన్లు ఎమర్జెన్సీ హెచ్చరికలు జారీ చేశాయి. అంతే! గ్వామ్‌వాసుల గుండెలు అదిరిపోయాయి. దీంతో.. వారు పోలీసులకు ఫోన్‌ చేసి రక్షించమని కోరారు. కానీ.. ఆ హెచ్చరికలు పొరబాటున వచ్చినవేనని అధికార వర్గాలు పేర్కొనడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ దీవి సమీపంలో క్షిపణిదాడులకు సంబంధించి ఉత్తరకొరియా సైనిక కమాండర్లు ఆ దేశాధిపతి కిమ్‌జాంగ్‌కు నివేదించినట్టు వస్తున్న వార్తలు.. వారిని నిద్ర పోనివ్వడ లేదు. ఇప్పుడే దాడులు చేయబోమని కిమ్‌ చెప్పినట్టు వార్తలు వస్తున్నా వారి భయాందోళనలు తగ్గట్లేదు.
nation
10,341
31-05-2017 14:22:54
నేను ఎప్పుడూ అలా అనలేదు: నిత్యా మీనన్‌
తెలుగులో అభినయ ప్రాధాన్యమున్న పాత్రలతో ఆకట్టుకున్నారు మలయాళ కుట్టి నిత్యామీనన్‌. ఉన్నట్టుండి ఈమెకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. దానికి కారణం ఆమె ఆలోచనలు దర్శకత్వంపైపు మలుపు తిరగడమే అనే వార్తలు వినిపించాయి. దీని గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు నిత్యామీనన్‌. ‘నాకు దర్శకత్వం మీద ఇష్టమున్నట్టు ఎప్పుడూ చెప్పలేదు. అది పూర్తిగా అసత్య ప్రచారం. నేను ఇప్పట్లో దర్శకత్వంవైపు వెళ్లాలనుకోవడం లేద’ని చెప్పారు నిత్యామీనన్‌. డైరెక్టర్‌గా మారాలనే ఆలోచనతోనే మణిరత్నం సినిమా అవకాశాన్ని కూడా నిత్య వదులుకున్నారని కొన్ని రోజుల క్రితం ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.
entertainment
7,796
26-01-2017 11:45:13
సొంత రాష్ట్రాన్ని వదిలేసి.. పక్క రాష్ట్రంపై ప్రేమ ఎందుకో?: వర్మ
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబుపై వివాదాల డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన డబ్బింగ్ మూవీలను ప్రమోట్ చేసుకోవడానికి తమిళ వికృత క్రీడ జల్లికట్టుకు మద్దతు తెలిపిన మహేశ్ బాబు.. తనను స్టార్‌గా నిలబెట్టిన ఏపీ కోసం, ఏపీ ప్రజల కోసం ఎందుకు మద్దతు తెలపట్లేదని ప్రశ్నించాడు. ఏపీ ప్రత్యేక హోదా కోసం పోరాడకుండా.. పక్క రాష్ట్రాల వారు చేసే ఆందోళనకు మద్దతు తెలుపుతున్న మహేశ్ దేశ ద్రోహి అంటూ సంచలన వ్యాఖ్య చేశాడు. ఏపీ సమస్యలను పట్టించుకోకుండా పక్క రాష్ట్రం సమస్యపై వారి ఆందోళనకు మహేశ్ మద్దతు తెలపడంతో ఆంతర్యం ఏంటని ప్రశ్నించాడు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న పవన్ కల్యాణ్‌కు మద్దతు తెలపాల్సిందిగా మహేశ్‌కు చెప్పని అతడి అభిమానులు కూడా మహేశ్‌లాగానే దేశద్రోహులని వ్యాఖ్యానించాడు. మహేశ్ రాజకీయాల్లో లేనప్పుడు ఏపీ సమస్యలపై పవన్ పోరాడుతున్నా ఏం పట్టనట్టుండి.. తమిళ జల్లికట్టుపై తన ఆవేదనను వ్యక్త పరచడం దేనికి సంకేతం అని ప్రశ్నలు సంధించాడు. కాగా, మహేశ్‌పై విమర్శనాస్త్రాలు సంధించిన వర్మ.. పవన్‌పై మాత్రం పొగడ్తల వర్షం కురిపించాడు. ఆర్నాల్డ్, సిల్వెస్టర్ స్టాలోన్, బ్రూస్‌లీ వంటి వారు సాధారణ సమస్యలపైనే పోరాడితే.. పవన్ మాత్రం ప్రభుత్వాలపైనే పోరాడుతున్నాడని ప్రశంసించాడు. హీరోలంతా సినిమాల్లో రాజకీయ నాయకులు, పోలీసులపై పోరాడుతుంటే.. పవన్ మాత్రం నిజ జీవితంలో రాజకీయ నాయకులతో పోరాడుతున్నాడని ట్వీట్ చేశాడు.
entertainment
16,839
21-04-2017 00:31:12
ఉమాభారతి రాజీనామా చేయాలి: ఖర్గే
బెంగళూరు, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో సుప్రీం ఆదేశాల నేపథ్యంలో కేంద్రమంత్రి ఉమాభారతి వెంటనే రాజీనామా చేయాలని లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్‌ చేశారు. గురువారం కలబురిగిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇతర పార్టీల నేతలపై ఆరోపణలు వచ్చినప్పుడు రాజీనామా కోరే బీజేపీ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటోందని ప్రశ్నించారు. బాబ్రీమసీదు వివాదంలో ఉమాభారతితో పాటు ఇతరులపై చర్యలు తీసుకుంటామన్న ప్రధాని మోదీ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. అందరికీ ఒకే పద్ధతి ఉండాలన్నారు. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణలో ఉమాభారతి, ఎల్‌కే ఆడ్వాణీ, మురళీమనోహర్‌ జోషి తదితరుల పేర్లు ఉన్నందున ప్రధాని వెంటనే స్పందించాలని కోరారు.
nation
6,218
07-12-2017 19:09:22
ఈ సినిమాకి వారు ముగ్గురు.. మూడు పిల్లర్స్: నిర్మాత డా.ర‌వికిర‌ణ్‌
సప్తగిరి కథానాయకుడిగా న‌టించిన చిత్రం `స‌ప్త‌గిరి ఎల్‌.ఎల్‌.బి`. సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై లిమిటెడ్‌ బ్యానర్‌పై చరణ్‌ లక్కాకుల దర్శకత్వంలో డా.రవికిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్‌ 7న వరల్డ్‌వైడ్‌గా విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా ప్రీమియ‌ర్ షో అనంత‌రం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో... చిత్ర నిర్మాత డా.ర‌వికిర‌ణ్ మాట్లాడుతూ - ``స‌ప్త‌గిరి ఎల్‌.ఎల్‌.బి చిత్రానికి హిట్ టాక్ రావడం ఎంతో హ్యాపీగా ఉంది. సాధార‌ణంగా ఏదో సినిమా తీయాల‌ని కాకుండా ఓ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా తీయాల‌నే ఉద్దేశంతో ఈ సినిమాను చేశాం. నా ప్రొడ‌క్ష‌న్‌లో వ‌చ్చిన స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్ కంటే ఈ సినిమాకు అన్ని వ్య‌వ‌హ‌రాల‌ను ద‌గ్గ‌రుండి చూసుకున్నాను. ఇలాంటి స‌బ్జెక్ట్‌ను చెప్పాల‌నుకుంటే ఇమేజ్ ఉన్న హీరో కంటే, ఇమేజ్ లేని నటుడైతేనే బావుంటుంద‌ని స‌ప్త‌గిరితో సినిమా చేశాను. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌గారు మంచి డైలాగ్స్ రాశారు. మాతృకలోని ఫ్లెవ‌ర్‌కి అన్యాయం చేయకుండా తెలుగులోనికి మార్చడానికి చాలా హార్డ్ వ‌ర్క్ చేశాం. శివ‌ప్ర‌సాద్‌గారు, సాయికుమార్‌గారు, స‌ప్త‌గిరిగారు.. మూడు పిల్ల‌ర్స్‌లా ఈ సినిమాకు వ‌ర్క్ చేశారు. ఓ మంచి సినిమాను నిర్మించినందుకు నిర్మాత‌గా సంతోషంగా ఉన్నాను. భ‌విష్య‌త్‌లో కూడా ఇలాంటి మంచి మెసేజ్ ఉన్న చిత్రాల‌నే నిర్మిస్తాను.  ఇక సినిమాలో న‌టించ‌డం అనేది యాదృచ్చికంగానే జ‌రిగింది. మ‌రి భ‌విష్య‌త్‌లో న‌టిస్తానా? లేదా? అనేది చెప్ప‌లేను. అంతా! ఆ భ‌గ‌వంతుడి చేతిలో ఉంది. చిన్న‌ప్పుడు స్టేజ్ ఆర్టిస్ట్ కావ‌డంతో ఆ అనుభ‌వం ఇక్క‌డ ప‌నికొచ్చింది. సినిమాకు సినిమాటోగ్ర‌ఫీ, రీరికార్డింగ్ పెద్ద ప్ల‌స్ అయ్యాయి. స‌ప్త‌గిరితో మూడో సినిమా చేస్తాన‌ని ఇప్పుడే చెప్ప‌లేను. క‌థ డిమాండ్ చేస్తే త‌న‌తో చేస్తాను. లేదా మరో హీరోతో అయినా చేయ‌డానికి నేను సిద్ధ‌మే. ద‌ర్శ‌కుడు చ‌ర‌ణ్‌, స‌ప్త‌గిరి స‌హా అంద‌రికీ స‌మిష్టి కృషే ఇది. నాది ఆదిలాబాద్ జిల్లా. నేను పుట్టి పెరిగిన ఊరు కావ‌డంతో పాటు.. అక్క‌డి రైతుల ఆత్మ‌హ‌త్య‌లు న‌న్ను క‌లిచివేసింది. కాబ‌ట్టి వారి స‌మ‌స్య‌ల‌ను ఈ సినిమా ద్వారా తెర‌పై చూపాల‌నుకున్నాను. `ఫిదా` త‌ర్వాత తెలంగాణ‌లో అంద‌మైన లోకేష‌న్ ఉన్న ప‌ల్లెటూరిని మా సినిమాలోనే చూపించాం`` అన్నారు.
entertainment
8,625
12-09-2017 17:58:47
చిరు, బాలయ్య, వెంకీ, మహేశ్, రవితేజతో సినిమాలకు ప్లాన్
ఇప్పటికీ స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు దక్కించుకుంటున్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు విజయాలు మాత్రం రావడం లేదు. అయితే కొందరు హీరోలతో సినిమాలు చేయాలని ఆయన ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నాడట. సినిమాను జెట్ స్పీడుతో పూర్తి చేయడంతో దర్శకుడు పూరి జగన్నాథ్ తరువాతే ఎవరైనా. సినిమా రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా తాను అనుకున్న సినిమాను అనుకున్న సమయం కంటే ముందుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో పూరి మిగతా వాళ్ల కంటే కాస్త ముందుంటానే చెప్పాలి. అందుకే మిగతా స్టార్ డైరెక్టర్లతో పోలిస్తే ఆయన సినిమా కౌంట్ ఎక్కువగా ఉంటుంది. బాలకృష్ణతో 'పైసా వసూల్' తెరకెక్కించి హిట్ కొట్టలేకపోయిన పూరి జగన్నాథ్, వచ్చే ఏడాది ఆయనతో మరో సినిమాను తెరకెక్కించబోతున్నట్టు ఇప్పటికే అనౌన్స్ కూడా చేశాడు. అయితే ఈలోపే తన కుమారుడు ఆకాశ్ పూరిని హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమాను తెరకెక్కించబోతున్నాడు పూరి. అక్టోబర్‌లో సెట్స్ మీదకు వెళ్లబోయే ఈ సినిమాను నాలుగు నెలల్లో పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నాడట టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.  ఇదిలా ఉంటే బాలయ్యతో పాటు పూరి జగన్నాథ్ సినిమాలు చేయాలనుకుంటున్న హీరోల లిస్టు చాలా పెద్దగానే ఉందని సినీ జనం చర్చించుకుంటున్నారు. ఇషాన్, బాలకృష్ణ, ఆకాశ్, రవితేజ, చిరంజీవి, మహేశ్, వెంకటేశ్ ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా ఏడుగురు హీరోల పేర్లు పూరి లిస్ట్‌లో ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. మహేశ్ సినిమాకు 'జనగణమన' అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసిన పూరి ఆయన ఎప్పుడంటే అప్పుడు సినిమా చేసేందుకు రెడీగా ఉన్నాడు. ఇక మాస్ హీరో రవితేజ కోసం మరో మాస్ మసాలా స్టోరీ సిద్ధం చేశానని పూరి క్లారిటీ ఇచ్చాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే చిరంజీవి, వెంకటేశ్‌తోనూ సినిమాలు సెట్ అవుతాయనే నమ్మకంతో ఉన్నాడట పూరి జగన్నాథ్. ఇక రోగ్ హీరో ఇషాన్‌తో పూరి మరో సినిమా చేయాల్సి ఉందట. రోగ్ సినిమా టైమ్‌లోనే కుదిరిన 2 సినిమాల ఒప్పందం ప్రకారం టైమ్ చూసుకుని పూరి జగన్నాథ్ ఈ సినిమా చేస్తాడని కొందరు చర్చించుకుంటున్నారు. మరి సినిమాలు తప్ప సక్సెస్‌లు సాధించలేకపోతున్న పూరితో వీరిలో ఎంతమంది సినిమాలు చేస్తారన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.
entertainment
7,897
11-11-2017 15:24:05
`బాహుబ‌లి-2` రికార్డు బ్రేక్‌!
ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన `బాహుబ‌లి: ది కంక్లూజ‌న్‌` సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రికార్డుల మోత మోగించిన విష‌యం తెలిసిందే. బాలీవుడ్ సినిమాలు కూడా `బాహుబ‌లి-2` ముందు నిల‌వ‌లేక‌పోయాయి. ఆ సినిమా ట్రైల‌ర్ కూడా యూట్యూబ్‌లో రికార్డులు న‌మోదు చేసింది. అత్యంత మంది లైక్ చేసిన ట్రైల‌ర్‌గా నిలిచింది.  దాదాపు ఆరున్న‌ర ల‌క్ష‌ల లైకుల‌తో ఆగ్ర‌స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఆ రికార్డును స‌ల్మాన్‌ఖాన్ న‌టించిన `టైగ‌ర్ జిందా హై` బ్రేక్ చేసింది. ఏడు ల‌క్ష‌ల‌కు పైగా లైకులు సాధించిన తొలి భార‌తీయ సినిమాగా నిలిచింది. అంతేకాదు వ్యూస్ విష‌యంలో కూడా రికార్డును ద‌క్కించుకునేందుకు ప‌రుగులు పెడుతోంది. ఈ ట్రైల‌ర్‌కు ఇప్ప‌టికే మూడు కోట్ల వ్యూస్ రావ‌డం గ‌మ‌నార్హం. ఇదే జోరు కొన‌సాగిస్తే వ్యూస్ విష‌యంలో కూడా `బాహుబ‌లి-2`ను త్వ‌ర‌లోనే దాటేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.
entertainment
12,981
12-03-2017 01:51:51
అతిపెద్ద విజయం!
నరేంద్ర మోదీ నేతృత్వంలో కమలదళం చరిత్ర తిరగరాసింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో విజయబావుటా ఎగురవేసింది. 320కిపైగా సీట్లను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. 1951-52లో జరిగిన తొలి ఎన్నికల తర్వాత ఓ పార్టీ ఇన్ని స్థానాలను గెలుచుకోవడం ఇదే ప్రథమం. అయితే అప్పుడు ఉత్తరప్రదేశ్‌ అవిభక్తంగా ఉండగా మొత్తం 430 అసెంబ్లీ స్థానాలుండేవి. వాటిలో కాంగ్రెస్‌ పార్టీ 388 స్థానాలను చేజిక్కించుకుంది. 1977లో దేశవ్యాప్తంగా వీచిన ప్రభంజనంతో జనతాపార్టీ యూపీలో 352 స్థానాలను గెలుచుకుంది. అయితే అప్పుడు కూడా మొత్తం స్థానాల సంఖ్య 430 కావడం విశేషం. మూడున్నర దశాబ్దాలుగా ఏ పార్టీకి కూడా ఇంత భారీ విజయాన్ని యూపీ ఓటర్లు కట్టబెట్టలేదు. 1991లో అయోధ్య ప్రభంజనంలో కూడా యూపీ ఓటర్లు బిజెపిని 221 స్థానాల్లో మాత్రమే గెలిపించారు. ఆ త రువాత 2007లో బీఎస్పీకి బొటాబొటిగా 207 స్థానాలు మాత్రమే లభించాయి. 2012లో సమాజ్‌వాదీ పార్టీకి 224 స్థానాలు లభించాయి. భిన్న సామాజిక వర్గాల సమీకరణాలు, మతాల సమీకరణాల్లో భారీ మెజారిటీ సాధించడం అసాధ్యమని 30 ఏళ్ల ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి.
nation
4,305
03-02-2017 01:07:50
గోడలూ – మేడలూ
గొప్పవాళ్ళు తలుచుకుంటే గొడవలకు కొదవేముంటుంది? గోడలు కూడా గొడవలకు కేంద్ర బిందువులవుతాయి. అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పుణ్యమా అని ‘గోడ’ ఇప్పుడొక ప్రపంచ వార్త! గొడవలతో అధ్యక్ష ఎన్నికల బరిలో దునికిన ఆయన గోడలతో పాలనను ప్రారంభిచాడు. అమెరికా – మెక్సికో దేశాల సరిహద్దులో గోడను నిర్మించేందుకు ఉద్దేశించిన ఫైలుపై సంతకం చేసేశారు! శుభం!!గోడలు వేదికగా ఇకనుండి గొడవలే గొడవలు! ఆ గోడ కట్టడానికయ్యే ఖర్చును అణా పైసలతో సహా గోళ్ళు ఊడగొట్టి మరీ వసూలు చేస్తానంటున్నాడు డొనాల్డ్‌ ట్రంప్‌! ఆ పప్పులేవీ మా దగ్గర ఉడకవు పొమ్మంటున్నారు మెక్సికో అధ్యక్షుడు ఎన్రికో నీటో! ఈ ఉడుక్కోవడాలు ఇక్కడికే పరిమితమవుతాయా లేక రెండు దేశాలను రేపటి రోజున అట్టుడికిస్తాయా అన్నది ఇప్పటికిప్పుడు తేలే సమస్య కాదు. దేశదేశాల మధ్య గోడల్ని చెరిపివేసి ప్రపంచాన్ని గ్లోబల్‌ విలేజీగా మార్చే పనిని భుజానికెత్తుకున్న వాళ్ళకు తమచుట్టూ గోడలు కట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు తలెత్తిందన్నది ఇప్పటి ప్రశ్న! తమ దాకా వస్తే తప్ప ఎవరికైనా తత్వం బోధపడదన్న మాట! తాము మేడలు కట్టుకోవడానికి పొరుగువాళ్ళ గోడల్ని కూల్చాలి. కానీ తాము మాత్రం గోడల రక్షణలో సురక్షితంగా జీవించాలి. ఒకవేళ తమకు జీవించడం దుర్భరమైనట్లైతే ఇతరులెవరూ ప్రశాంతంగా బతకడానికి వీల్లేదు. గోడ(లు) ఇక్కడొక సాకు మాత్రమే! గొడవలు మాత్రం అనివార్యం! గోడల్ని నిర్మించి కొత్తగా మరికొన్ని గొడవల్ని సృష్టించడం –- తద్వారా తన భవిష్యత్‌ రాజకీయ జీవితానికి పటిష్టమైన కోటగోడను నిర్మించుకోవడమే ట్రంప్‌ మహాశయుడి ప్రథమ ప్రాధాన్యంగా కనిపిస్తున్నది. అమెరికన్ల కోసమే అమెరికా అనే నినాదం ఆ విధంగానే పుట్టుకు వచ్చింది. అధ్యక్షుల వారి అంతరంగాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే తప్ప అందులోని అంతరార్థం అట్టే మనకు బోధపడదు. అందులో భాగంగానే ఇప్పుడు మరిన్ని కొత్త చట్టాలు, మరింత పదును తేలి ప్రపంచం పైకి దూసుకురాబోతున్నాయి. తాము చేసిందే చట్టం! తాము చెప్పిందే వేదం! ఇదే అమెరికన్ల రీతి! అమెరికా నీతి! అసలు ప్రపంచమే అమెరికన్ల కోసం! అందుకే అమెరికన్ల ‘గోడలు’ వర్థిల్లాలి! ఆ గోడల పునాదులపై నిర్మించుకున్న మేడలూ వర్థిల్లాలి! అమెరికన్ల అవసరాలు వర్థిల్లాలి! వారి ఆలోచనా విధానాలూ వర్థిల్లాలి! ట్రంప్‌ గారి విజయఢంకా, రెండోసారీ మోగితీరాలి! ప్రపంచం ఎప్పటిలాగే అమెరికా పాలకుల పడగనీడనే బిక్కుబిక్కుమంటూ తమ బతుకులు వెళ్లమార్చాలి.- గుండెబోయిన శ్రీనివాస్‌, హైదరాబాద్‌
editorial
21,394
03-06-2017 15:52:46
ఎమోషన్స్‌ను ఓ రేంజ్‌కు తీసుకెళుతున్న ఇండియా-పాక్ మ్యాచ్!
ఆంధ్రజ్యోతి: సరిహద్దుల్లో టెన్షన్.. క్రికెట్ ఫీల్డ్‌లో రణరంగం.. కనీవినీ ఎరుగని ఉత్కంఠ. ఇండియా-పాక్ తలపడితే ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ కంటే కూడా ఎక్కువ మంది చూస్తారు. వన్‌డే క్రికెట్‌కు క్రేజ్ పోయిందనుకుంటున్న టైమ్‌లో బ్లాక్ బస్టర్ క్లాష్. ఛాంపియన్స్ ట్రోఫీలో బ్లాక్ బస్టర్ ఫైట్ జరగబోతోంది. ఇండియా-పాకిస్థాన్ తలపడబోతున్నాయి. ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉండగా ఛాంపియన్ ట్రోఫీలో రంజైన మ్యాచ్ జరగబోతోంది. ఇండియా-పాక్ తలపడితే సాధారణంగా ఎమోషన్స్ పీక్స్‌లో ఉంటాయి. కొన్నేళ్లుగా ఐసీసీ వేదికలపైనే తలపడుతున్నందున ఉత్కంఠ మరీ ఎక్కువైంది. ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎమోషన్స్ ఓ రేంజ్‌కు వెళ్లిపోయాయి. దీనిపై మరింత సమాచారం వీడియోలో చూడండి.
sports
9,787
10-10-2017 15:29:28
రకుల్‌కి ఈ టైప్‌లో బర్త్‌డే విశెష్ ఎవరూ చెప్పి ఉండరేమో?
యంగ్ హీరో సాయిధరమ్ తేజ్, తనతో 'విన్నర్' చిత్రంలో నటించిన రకుల్ ప్రీత్ సింగ్‌కి చాలా వెరైటీగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. 'లకుల్ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు' అంటూ తెలిపిన సాయిధరమ్, ఈ విశెష్‌తో పాటు ఓ ఫొటోని కూడా పోస్ట్ చేశారు. ఇప్పుడీ ఫొటో వైరల్ అవుతోంది. పుట్టిన రోజు అంటే ఎవరైనా కేక్ కట్ చేసే ఫొటోనో, లేదంటే నవ్వుతూ హాయిగా ఎంజాయ్ చేసే ఫొటోనో పోస్ట్ చేస్తారు. కానీ రకుల్ ప్రీత్ సింగ్ నోరు తెరచి నిద్రిస్తుంటే, ప్రక్కన 'చూడండి ఎలా నిద్రపోతుందో' అన్నట్లుగా తన ఎక్స్‌ప్రెషన్‌తో ఉన్న ఫొటోని పోస్ట్ చేసి సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యాడు సాయిధరమ్. మరి ఈ ఫొటోపై రకుల్ ప్రీత్ ఎలా స్పందిస్తుందో తెలియదు కానీ, బర్త్‌డే రోజు సాయి నుండి ఇటువంటి ట్వీట్‌ను మాత్రం రకుల్ ఊహించి ఉండదు. రకుల్ పుట్టినరోజని తెలిసి అందరూ ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు కానీ, సాయిధరమ్ టైప్‌లో మాత్రం ఇప్పటి వరకు ఎవరూ ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపలేదు. రవితేజతో రకుల్ ‘నువ్వే నువ్వే’ అంటూ అదరగొట్టింది రకుల్ ప్రీత్ సింగ్ స్వస్థలం ఎక్కడో తెలుసా?
entertainment
10,920
30-11-2017 22:43:00
నలుగురు రాణులు
హిందీలో విజయవంతమైన ‘క్వీన్‌’ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రీమేక్‌ అవుతోంది. ప్రస్తుతం పారిస్‌లో చిత్రీకరణ జరుగుతోంది. నాలుగు భాషల్లోనూ ‘క్వీన్‌’ టైటిల్‌ పాత్ర పోషిస్తున్న తమన్నా, కాజల్‌, మంజిమా మోహన్‌, పారుల్‌ యాదవ్‌పారిస్‌లో ఇలా ఫొటోకు ఫోజ్‌ ఇచ్చారు.
entertainment
2,694
08-10-2017 00:56:45
గాజుపై పెరుగుతున్న మోజు
వ్యాపార విస్తరణలో మోడర్న్‌ సేఫ్టీ గ్లాస్‌..రూ.10 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యం రెట్టింపుబహుళ అంతస్తుల వాణిజ్య సముదాయాలు, ఖరీదైన నివాస గృహాలు, కార్యాలయ భవనాలు... అన్నీ అద్దాల మేడలే. నిర్మాణంలో, డిజైనింగ్‌లో తమ కౌశల్యాన్ని ఆవిష్కరించేందుకు ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్‌ డెకొరేటర్స్‌ అత్యంత ఇష్టంగా ఎంచుకునేది గ్లాస్‌. గ్రీన్‌ బిల్డింగ్‌ల్లోనూ గ్లాస్‌కే ప్రాధాన్యం. గత కొన్నేళ్లుగా నిర్మాణ రంగంలో గ్లాస్‌ వినియోగం భారీ ఎత్తున పెరిగింది. నిర్మాణ రంగంలో ధృడంగా ఉండే సేఫ్టీ గ్లాస్‌ను విరివిగా ఉపయోగిస్తారు. ఈ విభాగంలో మార్కెట్‌ శరవేగంగా విస్తరిస్తోంది.  హైదరాబాద్‌కు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వాసుదేవ ప్రభు, సాదిక్‌ కపాడియా ప్రమోట్‌ చేసిన చిన్న తరహా పరిశ్రమ మోడర్న్‌ సేఫ్టీ గ్లాస్‌ సంస్థ హెర్క్యులస్‌ బ్రాండ్‌తో టఫెండ్‌ గ్లాస్‌, ఇన్సులేటెడ్‌ గ్లాస్‌, స్విచ్చబుల్‌ గ్లాస్‌ను తయారు చేసి మార్కెట్‌ చేస్తోంది. నగర శివార్లలో ఈ సంస్థకు ఏటా లక్ష టన్నుల గ్లాస్‌ ప్రాసెసింగ్‌ సామర్ధ్యం ఉన్న ప్లాంటు ఉంది. ఈ ప్లాంటు సామర్ధ్యాన్ని 10 కోట్ల రూపాయలతో రెండు లక్షల టన్నులకు విస్తరిస్తున్నట్టు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సాదిక్‌ కపాడియా, డైరెక్టర్‌ ప్రభు చెప్పారు. రోబోటిక్‌ టెక్నాలజీతో పూర్తి ఆటోమేషన్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు వారు తెలిపారు. కొత్త ప్లాంట్‌ 2020 నాటికి పూర్తవుతుంది. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన సంస్థలనుంచి ముడి గ్లాస్‌ను కొనుగోలు చేసి తమ ప్లాంట్‌లో ప్రాసెస్‌ చేసి భారీ నిర్మాణాల్లో వినియోగానికి వీలుగా సేఫ్టీ గ్లాస్‌గా మలుస్తున్నట్టు వారు చెప్పారు. ఫ్రాన్స్‌కు చెందిన సెయింట్‌ గోబైన్‌ నుంచి ముడి గ్లాస్‌ను కొనుగోలు చేస్తోంది. ఆస్ట్రేలియా సంస్థతోనూ ఒప్పందాలు కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో ఇటీవల కాలంలో భారీ నిర్మాణాల్లో సేఫ్టీ గ్లాస్‌ వినియోగం భారీగా పెరిగిందని ప్రభు చెప్పారు. అయితే నాణ్యతకు వినియోగదారులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, ఈ విషయంలో ఏ మాత్రం రాజీపడటం లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా నిర్మాణంలో గ్లాస్‌ వినియోగం పెరుగుతోందని ఆయన తెలిపారు. పొరుగు రాష్ట్రాల్లోకి విస్తరణ... ఇప్పటి వరకు హైదరాబాద్‌తో సహా రెండు తెలుగురాష్ట్రాల మార్కెట్లకే పరిమితమైన తమ హెర్క్యులస్‌ బ్రాండ్‌ను కర్నాటక, తమిళనాడు, ఒడిషాలకు కూడా విస్తరిస్తున్నట్టు సాదిక్‌, ప్రభు తెలిపారు. ఇప్పటి వరకు సొంత మార్కెటింగ్‌ నెట్‌వర్క్‌ ద్వారా విక్రయాలు జరిపినప్పటకీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో డీలర్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లోనే నిర్మాణాల్లో, ఇంటీరియర్‌ డిజైన్‌లో వినియోగించే వివిధ రకాల సేఫ్టీ గ్లాస్‌కు 150 కోట్ల రూపాయల విలువైన మార్కెట్‌ ఉంది. నిర్మాణ రంగం ఊపందుకుంటున్న నేపథ్యంలో డిమాండ్‌ మరింత రాజుకునే అవకాశం ఉంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని భవనాలను పూర్తిగా గ్రీన్‌ టెక్నాలజీతో డిజైన్‌ చేస్తున్నందున గ్లాస్‌కు డిమాండ్‌ మరింత పెరుగుతుందని కంపెనీ భావిస్తోంది. ‘2021 నాటికి కేవలం అమరావతిలోనే టఫ్‌ఎండ్‌, ఇన్సులేటెడ్‌ గ్లాస్‌కు రూ.150 కోట్ల విలువైన డిమాండ్‌ ఉంటుందని భావిస్తున్నాం’ అని సాదిక్‌ కపాడియా చెప్పారు. టెక్నాలజీనే దన్ను ఈ తరహా గ్లాస్‌ ఉత్పత్తుల మార్కెటింగ్‌లో టెక్నాలజీతో పాటు ఉత్పత్తుల నాణ్యత, కస్టమర్‌ సేవలు అత్యంత కీలకం. సెయింట్‌ గోబియన్‌ కంపెనీ సర్టిఫైడ్‌ గ్లాస్‌ ఉత్పత్తులు సరఫరా చేయడంతో అనేక మంది యుపివిసి విండోలు, డోర్ల తయారీదారులు మోడర్న్‌ సేఫ్టీ గ్లాస్‌నే వాడుతున్నారు. ఫసాడి ఫ్యాబ్రికేటర్లు, ఇంటీరియర్‌ ఆఫీసు పార్టిషన్ల మార్కెట్‌లోనూ తమ ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ ఉందని డైరెక్టర్‌ వి ప్రభు చెప్పారు. కంపెనీ ఎండితో పాటు తనకు ఈ రంగంలో ఉన్న సాంకేతిక అనుభవం కంపెనీని మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్లేందుకు బాగా ఉపయోగపడుతోందని తెలిపారు. ఈ అనుభవంతోనే ప్రస్తుతం హైదరాబాద్‌లో మరే గ్లాస్‌ ప్రాసెసింగ్‌ కంపెనీ తయారు చేయని స్విచ్చబుల్‌ గ్లాస్‌ను మోడరన్‌ సేఫ్టీ గ్లాస్‌ కంపెనీలో ఉత్పత్తి చేస్తున్నట్టు చెప్పారు. ఈ వ్యాపార విస్తరణతో గత ఏడాది రూ.8 కోట్లు ఉన్న టర్నోవర్‌ ఈ ఆర్థిక సంవత్సరం రూ.14 కోట్లకు, 2020 నాటికి రూ.25 కోట్లకు పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది.- హైదరాబాద్‌, ఆంధ్రజ్యోతి బిజినెస్‌
business
20,666
23-01-2017 17:37:54
6వ స్థానంలో ఆణిముత్యాన్ని కనుగొన్నాం.. : గవాస్కర్
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కేదార్ జాదవ్ అద్భుత ప్రదర్శన చేశాడు. మొదటి వన్డేలో 120 పరుగులు చేసి ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ను గెలిపించి రాత్రికి రాత్రే హీరో అయిపోయాడు. సెకండ్ వన్డేలో 22 పరుగులు చేయగా మూడో వన్డేలో అజేయంగా 90 పరుగులు చేసి దాదాపుగా మ్యాచ్ గెలిపించినంత పని చేశాడు. బ్యాటింగ్‌లోనే కాదు అటు బౌలింగ్‌లో కూడా తనదైన ముద్ర వేశాడు. ఈ క్రమంలో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌ను కూడా దక్కించుకున్నాడు. అయితే దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. జాదవ్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. టీమిండియా ఒక ఆణిముత్యాన్ని కొనుగొన్నదని, 6వ స్థానంలో బ్యాటింగ్‌కు జాదవ్ అతికినట్టు సరిపోతాడని అన్నారు. చివరి ఓవర్లలో మంచి ఫినిషర్‌గా అదరగొట్టగలడని అభిప్రాయపడ్డారు. దీంతోపాటు కెప్టెన్‌గా పూర్తి బాధ్యతలను స్వీకరించిన కోహ్లీ సారధ్య బాధ్యతలు పెరిగినప్పటికీ బ్యాటింగ్‌లో మాత్రం ఎటువంటి మార్పు లేకుండా రాణించడం గొప్ప విషయమని అన్నారు. ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్ నెగ్గినందుకు కోహ్లీ సేనకు శుభాకాంక్షలు తెలిపారు.
sports
16,899
27-01-2017 03:22:57
ఆకాశ్‌ క్షిపణులు
 హరియాణా శకటం ‘బేటీ బచావో, బేటీ పఢావో’ థీమ్‌తో సాగడం విశేషం. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌ శాఖ శకటాన్ని జీఎస్టీ థీమ్‌తో తీర్చిదిద్దడం ఆకర్షించింది. ఈ శకటం వచ్చినప్పుడు కేంద్ర విద్యుత శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ లేచి నిలబడి మరీ చప్పట్లు కొట్టడం కనిపించింది. ఇక.. గోవా, గుజరాత, ఒడిసా, పశ్చిమబెంగాల్‌, జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాల శకటాలు వివిధ రంగాల్లో దేశ పురోభివృద్ధిని ప్రతిబింబించాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, త్రిపుర.. వరుసగా యాక్‌ డాన్స్‌, జానపద నృత్యాలు, కరకాట్టం, గిరిజన నృత్యం హోజగిరి థీమ్‌లతో తమ శకటాలను తీర్చిదిద్దాయి. ఢిల్లీ శకటం ఆదర్శ ప్రభుత్వ పాఠశాల థీమ్‌తో సాగింది. 23 ఏళ్ల తర్వాత పెరేడ్‌లో పాల్గొంటున్న లక్షద్వీప్‌.. పర్యాటక థీమ్‌తో శకటాన్ని తీర్చిదిద్దింది. సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ శకటం ‘క్లీన్‌ ఇండియా-గ్రీన్‌ ఇండియా’ థీమ్‌తో.. నైపుణ్యాభివృద్ధి శాఖ ‘స్కిల్‌ ఇండియా’ థీమ్‌తో.. అసోం శకటం కామాఖ్య ఆలయం థీమ్‌తో ఆకట్టుకున్నాయి.
nation
9,362
19-01-2017 18:16:18
అసభ్య పోస్ట్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేసిన హీరోయిన్!
కొచ్చి : అందరినీ గౌరవించడమే నాగరికత. మహిళల పట్ల మరింత మర్యాదగా ప్రవర్తించాలి. అభివృద్ధి చెందుతున్నకొద్దీ నడవడిక మెరుగుపడాలి. చేతికి వస్తున్న కొత్త హంగులను సద్వినియోగం చేయడం తెలుసుకోవాలి. అంతేకానీ ఆధునిక సదుపాయలతో చాటుమాటున ఉంటూ ఎదుటివారిని, అందులోనూ మహిళలను కించపరచడాన్ని ఎవరూ సమర్థించరు. మళయాళ సినీ నటి కావ్య మాధవన్‌కు కొందరి వల్ల తీవ్ర మనోవేదన కలుగుతోందట. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు రాతలు రాస్తూ ఆమె మనసును గాయపరుస్తున్నారట. అందుకే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొచ్చి సిటీ పోలీసుల కథనం ప్రకారం మళయాళ సినీ నటి కావ్య మాధవన్‌కు నవంబరు 25న దిలీప్‌తో వివాహమైంది. ఆమెపైనా, దిలీప్‌పైనా సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్ట్‌లు పెడుతుండటంతో దంపతులిద్దరూ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఆమె నిర్వహిస్తున్న డిజైన్ వెంచర్ లక్ష్య.కామ్ ఫేస్‌బుక్ పేజీలోనే ఈ చెడు వార్తలు పోస్ట్ అవుతుండటంతో మరింత బాధపడుతున్నారు. ఆమె ఎర్నాకుళం రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌కు మంగళవారం ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. ఆమె గతంలో కూడా పోలీసులను ఆశ్రయించారు. తన వ్యక్తిగత జీవితంపై పుకార్లు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ కేసు పెట్టారు. ఆమె పేరుపై నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని గతంలో అరెస్టు చేశారు. ఆమె పేరుపై ఇటువంటి నకిలీ ప్రొఫైల్స్ 12 ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
entertainment
17,732
10-05-2017 04:05:55
ఇంటికే రైలు టికెట్లు.. వచ్చాకే పైసలివ్వండి!
న్యూఢిల్లీ, మే 9: ఐఆర్‌సీటీసీలో టికెట్లు బుక్‌ చేస్తున్నారా? అయితే మీ కోసం ఐఆర్‌సీటీసీ ఒక సరికొత్త వెసులుబాటు కల్పించింది. ఇప్పటికే ఉన్న డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ద్వారా చెల్లింపులతోపాటు.. పే-ఆన్‌-డెలివరీ(పీవోడీ) పేరుతో మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. అంటే, టికెట్లు బుక్‌ చేసి, అవి మీ ఇంటికి వచ్చాక అప్పుడు చెల్లించవచ్చన్నమాట. వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడం.. అదే సమయంలో, వినియోగదారులను ఆన్‌లైన్‌ విధానం వైపునకు మళ్లించడం కోసం తీసుకుంటున్న పలుచర్యల్లో భాగంగానే ఐఆర్‌సీటీసీ ఈ కొత్త సౌకర్యాన్ని కల్పించింది. టికెట్‌ బుకింగ్‌ ఏజెంట్ల ద్వారా బుక్‌ చేసుకునేవారు కూడా ఆ సమయంలో ఈ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ మొబైల్‌యాప్‌, పీసీ వెర్షన్‌.. రెండింటిలోనూ ఈ ప్రత్యామ్నాయాన్ని వినియోగించుకోవచ్చు. టికెట్లు ఇంటికి రాకమునుపే రద్దు చేస్తే.. క్యాన్సిలేషన్‌ చార్జీలతోపాటు, డెలివరీ చార్జీలు కూడా వినియోగదారే చెల్లించాలి.
nation
3,370
10-02-2017 03:04:42
పీడీఎస్‌యూ రాష్ట్ర సదస్సు
యూనివర్సిటీల పరిరక్షణకై ప్రగతిశీల, ప్రజాస్వామిక విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) నేడు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ లో రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహిస్తోంది. ఓయూ వైస్‌ ఛాన్సలర్‌ రామచంద్రం, భోపాల్‌ ఎన్‌సీఈఆర్‌టీ ప్రొఫెసర్‌ బుర్ర రమేష్‌, ఓయూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు కొండా నాగేశ్వర్‌ , సమున్నత, పలువురు విద్యార్థి సంఘ నేతలు పాల్గొంటున్నారు.– జూపాక శ్రీనివాస్‌, కె.ఎస్‌.ప్రదీప్‌
editorial
527
13-02-2017 01:11:40
ఇన్ఫీపై సెబి కన్ను
'ముసలం' పై వివరణ కోరాలని ఎక్స్ఛేంజీలకు ఆదేశంన్యూఢిల్లీ: ఇన్ఫోసిస్లో వ్యవస్థాపకులు, యాజమాన్యం మధ్య విభేదాలు రచ్చకెక్కిన నేపథ్యంలో మైనారిటీ ఇన్వెస్టర్ల ప్రయోజనాలు కాపాడేందుకు సెబి సన్నాహాలు చేస్తోంది. ఇన్ఫోసిస్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఒక కన్నేసి ఉంచింది. టాటాలు, యునైటెడ్‌ స్పిరిట్స్‌, రికో ఇండియా తర్వాత ఇటీవల రెగ్యులేటరీ దృష్టిని ఆకర్షించిన మరో సంస్థ ఇన్ఫోసిస్‌. ఆ సంస్థ వ్యవహారాలను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని, సంస్థల్లో అంతర్గత విభేదాలపై పత్రికల్లో పతాక శీర్షికల్లో వస్తున్న వార్తలపై కంపెనీ నుంచి వివరణలు తీసుకోవాలని స్టాక్‌ ఎక్స్ఛేంజీలను ఆదేశించామని సెబి సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. భిన్న రంగాల్లో అగ్రస్థానంలో ఉన్న కంపెనీల్లో కార్పొరేట్‌ గవర్నెన్స్‌, అంతర్గత పాలనాపరమైన వ్యవహారాలు రచ్చకెక్కడం, వార్తాపత్రికల్లో పతాక శీర్షికలకెక్కడం చాలా ఆందోళన కలిగించే అంశమన్నారు. సంస్థాగత, మైనారిటీ ఇన్వెస్టర్ల ప్రయోజనాలు ఇలాంటి సంఘటనల వల్ల దెబ్బ తినకూడదని తాము భావిస్తున్నట్టు ఆయన చెప్పారు.ఇలాంటి కంపెనీలన్నీ వృత్తిపరమైన నైపుణ్యాలతో నడుస్తున్నవని, విదేశీ ఇన్వెస్టర్లలో కూడా ఎంతో గౌరవం గలవని చెప్పారు. ఈ కంపెనీల్లో ఇలాంటి సంఘటనలు రచ్చకెక్కడం వల్ల పెట్టుబడులకు ఆకర్షణీయమైన కేంద్రంగా భారతకు గల ప్రతిష్ఠకు భంగకరమని ఆ అధికారి పేర్కొన్నారు. ఈ పరిణామాలపై స్టాక్‌ ఎక్స్ఛేంజీలు సేకరించే సమాచారం పరిశీలించిన అనంతరం అవసరమైతే సెబి నేరుగా వారి నుంచి వివరణలు కోరుతుందని సెబి అధికారి చెప్పారు. నేడు ఇన్వెస్టర్లతో సిక్కా భేటీ ఉన్నత స్థాయి యాజమాన్యానికి, సంస్థ వ్యవస్థాపకులకు మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరినట్టు వార్తలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇన్ఫీ సిఇఒ విశాల్‌ సిక్కా సోమవారం సంస్థాగత ఇన్వెస్టర్లతో భేటీ కానున్నారు. ఆ సమావేశంలో పాల్గొనే ఫండ్‌ మేనేజర్లకు సిక్కా సంస్థకు సంబంధించిన అంతర్గత వ్యవహారాలను వివరించవచ్చునని భావిస్తున్నారు. కోటక్‌ చేజింగ్‌ గ్రోత కాన్ఫరెన్స్‌లో సిక్కా పాల్గొనబోతున్నారన్న విషయం కంపెనీ ప్రతినిధి ఒకరు ధ్రువీకరించారు.ఇన్ఫోసిస్లో ప్రస్తుత పరిణామాలు వెలుపలికి రావడం కన్నా ముందే ఈ సమావేశం ఖరారయిందని ఆయన చెప్పారు. సమావేశం ఖరారైన అనంతరం ఈ వార్తలన్నీ బట్టబయలైన నేపథ్యంలో సోమవారం ఇన్వెస్టర్లు ఆ అంశాలపై సిక్కాను వివరణ కోరే అవకాశం ఉన్నదని కూడా భావిస్తున్నారు. సమావేశం అనంతరం సిక్కా కొందరు బోర్డు సభ్యులతో కలిసి మీడియా సమావేశంలో కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు.
business
1,175
06-07-2017 00:52:33
మార్కెట్లోకి మూడు కొత్త ఫోన్లు
దేశీయ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లోకి మరో మూడు కొత్త ఫోన్లు వచ్చాయి. అమెరికాకు చెందిన ఇన్‌ఫోకస్‌ ‘టర్బో5’, చైనాకు చెందిన లీఫోన్‌ ‘లీఫోన్‌ డబ్ల్యు2’, నుబియా ‘ఎన్‌2’ ఫోన్లను విడుదల చేశాయి. లీఫోన్‌ డబ్ల్యు2: ఈ ఫోన్‌ రెండు 4జి సిమ్‌లకు సపోర్ట్‌ చేస్తుంది. 1.3 గిగాహెట్జ్‌ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌, 1జిబి రామ్‌, 8జిబి ఇంటర్నల్‌ మెమరీ (మైక్రో ఎస్‌డి కార్డుతో 32 జిబిలకు పెంచుకోవచ్చు), 2 ఎంపి వెనుక కెమెరా, ముందు భాగంలో విజిఎ కెమెరా, ఆండ్రాయిడ్‌ మార్ష్‌మల్లో ఔస్‌, 4.5 అంగుళాల డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. తెలుగు సహా 22 ప్రాంతీయ భాషలకు ఈ మొబైల్‌ సపోర్ట్‌ చేస్తుందని కంపెనీ చెబుతోంది. దీని ధర 3,999 రూపాయలు. టర్బో 5: 4జి సర్వీసులకు సపోర్ట్‌ చేసే ఈ ఫోన్‌లో 5.2 అంగుళాల హెచ్‌డి ఐపిఎస్‌ 2.5డి గ్లాస్‌ డిస్‌ప్లే, 1.3 గిగాహెట్జ్‌ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ నౌగట్‌ ఔస్‌, 13 ఎంపి వెనుక కెమెరా, 5 ఎంపి సెల్ఫీ కెమెరా, 5000 ఎంఎహెచ్‌ బ్యాటరీ వంటి ఫీచర్లున్నాయి. 2జిబి రామ్‌ 16జిబి ఇంటర్నల్‌ మెమరీ ఉన్న ఫోన్‌ ధర 6,999 రూపాయలుండగా.. 3జి రామ్‌ 32 జిబి ఇంటర్నల్‌ మెమరీ ఉన్న ఫోన్‌ ధర 7,999 రూపాయలుగా ఉంది. ఎన్‌2: ప్రీమియం సెగ్మెంట్లో అందుబాటులోకి వచ్చిన ఫోన్‌ ఇది. ఇందులో 5.5 అంగుళాల హెచ్‌డి అమోఎల్‌ఇడి డిస్‌ప్లే, 4జిబి రామ్‌, 64 జిబి ఇంటర్నల్‌ మెమరీ, 13 ఎంపి వెనుక కెమెరా, 16 ఎంపి ముందు కెమెరా, ఆండ్రాయిడ్‌ మార్ష్‌మల్లో ఔస్‌, 5000 ఎంఎహెచ్‌ బ్యాటరీ, ఎంటికె ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్‌ ధర 15,999 రూపాయలు. ఇది అమెజాన్‌ డాట్‌ ఇన్‌లో లభిస్తుందని కంపెనీ తెలిపింది.మార్కెట్‌కు తెచ్చే అవకాశం ఉంది.
business
16,809
03-04-2017 15:37:47
దావూజీ హాస్పిటల్ డైరెక్టర్‌పై కాల్పులు
ఆగ్రా: ఆగ్రాలోని ఓ పెట్రోల్ బంక్‌లో కాల్పుల కలకలం రేగింది. దావూజీ హాస్పిటల్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న వైద్యుడు సునీల్‌పై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. కారులో పెట్రోల్ పోయిస్తుండగా ఈ ఘటన జరిగింది. ముగ్గురు దుండగులు ఒక్కసారిగా ఆయనపై కాల్పులు జరపడంతో సునీల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం సునీల్‌ అనుచరులతో దుండగులు గొడవ పెట్టుకున్నారు. వారిని కూడా ఇష్టం వచ్చినట్టు చితకబాదారు. ఈ దృశ్యాలు సీసీ పుటేజ్‌లో రికార్డయ్యాయి. సునీల్ అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
nation
1,005
22-04-2017 00:13:07
హోవిట్జర్ల తయారీలో ఎల్‌ అండ్‌ టి
న్యూఢిల్లీ: భారత సైన్యానికి సెల్ఫ్‌ ప్రొపల్షన్‌ గల 100 హోవిట్జర్‌ శతఘ్నులు ఉమ్మడిగా తయారుచేసేందుకు దక్షిణ కొరియాకు చెందిన రక్షణ సంస్థ హన్వా టెక్విన్‌తో ఇంజనీరింగ్‌ దిగ్గజం ఎల్‌ అండ్‌ టి ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ హోవిట్జర్ల విలువ 4,500 కోట్ల రూపాయలు. ఇందులో 10 హోవిట్జర్లను దక్షిణ కొరియా నుంచి నేరుగా దిగుమతి చేసుకుంటారు. మిగతా 90 శతఘ్నులను పుణె సమీపంలోని తాలేగాంలో ఉన్న ఎల్‌ అండ్‌ టి స్ర్టాటజిక్‌ సిస్టమ్స్‌ కాంప్లెక్స్‌లో తయారుచేస్తారు.  ఈ 155ఎంఎం/52 కాల్‌ ట్రాక్డ్‌ సెల్ఫ్‌ ప్రొపెల్డ్‌ కె9 వజ్ర-టి శతఘ్నుల మొదటి విడత డెలివరీ ఈ ఏడాది చివరిలో మొదలై 42 నెలల కాలంలో మొత్తం 100 శతఘ్నుల సరఫరా పూర్తి చేస్తారు. కె9 థండర్‌ శతఘ్నికి మరింత మెరుగులు దిద్ది తయారుచేసిన ఈ కొత్త కె9 వజ్ర-టి శతఘ్నులు ప్రపంచంలోని అత్యుత్తమ శతఘ్నుల్లో ఒకటిగా గుర్తింపు పొందాయి. 2015 సంవత్సరంలో ప్రధాని నరేంద్రమోదీ సియోల్‌ సందర్శన సమయంలో కుదిరిన అంగీకారం మేరకు భారతతో రక్షణ సహాయాన్ని మరింతగా విస్తరించుకుంటామని దక్షిణ కొరియా రక్షణ కొనుగోళ్ల శాఖ మంత్రి చాంగ్‌ మ్యోంగ్‌ జిల్‌ తెలిపారు.  రక్షణ ఉత్పత్తుల రంగంలోని భారత ప్రైవేటు కంపెనీలు, విదేశీ దిగ్గజాల మధ్య ఉమ్మడి అభివృద్ధి, ఉమ్మడి తయారీ కార్యకలాపాలకు ఈ ఒప్పందం కొత్త ఉత్తేజం ఇస్తుందని ఎల్‌ అండ్‌ టి డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌ హెడ్‌ జయంత పాటిల్‌ అన్నారు. తమ రక్షణ వ్యాపారాల్లో ఇది ఒక కొత్త మైలురాయిగా నిలుస్తుందని ఆయన చెప్పారు. హన్వా టెక్విన్‌తో తమ సహకారం ఈ శతఘ్నులకే పరిమితంకాదని, భవిష్యత్తులో తాము చేపట్టే మరిన్ని కార్యకలాపాలకు కూడా విస్తరించుకుంటామని తెలిపారు. తాము ఉమ్మడిగా తయారుచేసే కె9 వజ్ర-టి శతఘ్నులను ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం కూడా ఉన్నదని ఆయన అన్నారు.
business
6,199
21-05-2017 20:46:57
టైగర్.. తన మాట నిలబెట్టుకుంటాడా..?
హాలివుడ్ సూపర్ స్టార్ సిల్వెస్టర్ స్టాలొన్ ‘రాంబో’ సినిమాతో యూనిర్సల్ స్టార్‌గా ఎదిగారు. ఇప్పటికీ యాక్షన్ ప్రియుల హాట్ ఫేవరెట్‌గానే కొనసాగుతున్న ఈ మూవీని ఇప్పుడు హిందీలో రీమేక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ కుర్రహీరో టైగర్ ష్రాఫ్ రాంబో పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. రాంబో సినిమాకు తొలుత హృతిక్ రోషన్, సిద్ధార్థ్ మల్హోత్రా పేర్లు పరిశీలించినప్పటికీ చివరికి టైగర్ ఆ అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. స్వతహాగా మార్షల్ ఆర్ట్స్ నిపుణుడైన టైగర్ అయితేనే ఈ పాత్రకు న్యాయం చేయగలడని ఫిలిం మేకర్స్ భావిస్తున్నారు. మరో వైపు తన క్లాసిక్ మూవీ బాలీవుడ్‌లో రీమేక్ అవబోతుందని తెలుసుకున్న సిల్వెస్టర్ కూడా ట్విట్టర్‌లో స్పందించాడు. బాలీవుడ్‌లో రాంబో రీమేక్ అవుతుందని తెలుసుకున్నాని ట్వీట్ చేసిన సిల్వెస్టర్.. దీన్ని చెడగొట్టకుండా ఉంటారని ఆశిస్తున్నాను అంటూ తన మనసులోని భావాలను బట్టబయలు చేశాడు. దీనికి ప్రతిగా స్పందించిన టైగర్.. మిమ్మల్ని ఎప్పుడూ తలదించుకోనివ్వనంటూ రీట్వీట్ చేశాడు. మరి టైగర్ అన్న మాటను ఎంతవరకు నిలబెట్టుకుంటాడో చూడాలి.
entertainment
7,576
18-01-2017 11:38:16
‘కాటమరాయుడు’పై ఆ ప్రభావం పడుతుందా?
పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘కాటమరాయుడు’. డాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అజిత్‌ నటించిన ‘వీరమ్‌’ సినిమాకు అనధికార రీమేక్‌ అనే విషయం తెలిసిందే. ఈ కథాంశంతో ఇంతకుముందే తెలుగులో కూడా కొన్ని సినిమాలు వచ్చాయి. అసలు విషయమేమిటంటే.. అజిత్‌ నటించిన ఆ ‘వీరమ్‌’ చిత్రాన్ని తెలుగులో ‘వీరుడొక్కడే’గా ఎప్పుడో అనువాదం చేశారు. ఆ సినిమా ఇప్పటికే టీవీల్లో చాలాసార్లు వచ్చేసింది. అయినా ఆ సినిమాను రీమేక్‌ చేయడానికి సిద్ధపడ్డాడు పవర్‌స్టార్‌. ఈ నేపథ్యంలో ‘కాటమరాయుడు’ కథ గురించి తెలుగు వాళ్లకు సస్పెన్స్‌ ఏమీ ఉండదు. కేవలం పవన్‌ నటిస్తున్నాడన్న కారణం తప్ప ఆ సినిమా కథ కొత్తగా ఏమీ ఉండదు. ఈ నేపథ్యంలో ఆ ప్రభావం ‘కాటమరాయుడు’పై ప్రభావం పడుతుందని అనుకుంటున్నారు.
entertainment
13,547
11-08-2017 17:08:07
తొలిసారిగా నాలుగు కీలక రాజ్యాంగ పదవుల్లో బీజేపీ
న్యూఢిల్లీ: భారత ఉప రాష్ట్రపతిగా ఎం.వెంకయ్యనాయుడు శుక్రవారంనాడు ప్రమాణస్వీకారం చేయడంతో భారత దేశ రాజకీయ చరిత్రలో తొలిసారి నాలుగు అత్యున్నత పదవులూ బీజేపీ నేతలకే దక్కినట్టయింది. వెంకయ్యనాయుడుతో పాటు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ , ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ బీజేపీ నుంచి వచ్చిన వారే. ఆర్ఎస్ఎస్ నేపథ్యం కూడా వీరికుంది. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు శుక్రవారం హమీద్ అన్సారీ స్థానంలో ఉపరాష్ట్రపతిగా ప్రమాణం చేశారు. ఉపరాష్ట్రపతి హోదాలో ఆయన రాజ్యసభ ఎక్స్‌ అఫీషియో చైర్మన్‌గా కూడా ఉంటారు. 2019 నాటికి 'కాంగ్రెస్ ముక్త్ భారత్' అనేది ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నినాదంగా ఉంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశాలుంటాయి. కాగా, ప్రస్తుతానికి కీలకమైన రాజ్యంగ అత్యున్నత పదవుల్లో ఒకటైన రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్ పోస్ట్ మినహాయింగా ఉంది. కాంగ్రెస్‌కు చెదిన పీజే కురియన్ ఆ పదవిలో ఉన్నారు. 2012 ఆగస్టు 21న ఆయన నియమితులయ్యారు. కురియన్ స్థానంలో ఒకవేళ మార్పు చోటుచేసుకుంటే ఐదు ఉన్నత రాజ్యాంగ పదవులతో బీజేపీ క్లీన్ స్పీప్ సాధించే అవకాశాలుంటాయి. మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో (1998-2004) రాష్ట్రపతి, ఉపరాష్ట్ర, లోక్‌సభ స్పీకర్ పదవులు బీజేపీ చేతుల్లో లేవు. వాజ్‌పేయి పదవీకాలంలో ఇద్దరు రాష్ట్రపతులను చూశారు. కె.ఆర్.నారాయణన్ 1997-2002 వరకు కొనసాగగా, ఏపీజే అబ్దుల్ కలాం 2002-2007 వరకూ కొనసాగారు. నారాయణన్ కాంగ్రెస్ నుంచి వచ్చారు. కలాం రాజకేయతర వ్యక్తి. వాజ్‌పేయి హయాంలో రాష్ట్రపతి మాత్రమే కాదు...ఉపరాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్లు కూడా బీజేపీకి చెందిన వారు కాదు. భైరనా సింగ్ షెకావత్ మాత్రం ఇందుకు మినహాయింపు. 2003-2007 వరకూ ఆయన ఉపరాష్ట్రపతిగా కొనసాగారు. షెకావత్ ముందున్న కృష్ణకాంత్ (1997-2002) కాంగ్రెస్ నేతగా ఆ పార్టీలో పలు పదవులు కూడా నిర్వహించారు. వాజ్‌పేయి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని నడిపినప్పుడు తన ఇచ్ఛానుసారం లోక్‌సభ స్పీకర్‌ను నియమించే అవకాశం కూడా ఆయనకు దగ్గలేదు. రెండు సార్లు అవకాశం వచ్చినా ఆ రెండు సందర్భాల్లోనూ కీలకమైన ఆ పదవిని బీజేపీ భాగస్వాములకే కేటాయించాల్సి వచ్చింది. జీఎంసీ బాలయోగి (తెలుగుదేశం) లోక్‌సభ స్పీకర్‌గా రెండు సార్లు 1998, 1998లో ఎన్నికయ్యారు. 2002లో విమాన ప్రమాదంలో మరణించేంత వరకూ ఆయన ఆ పదవిలో కొనసాగారు. తరువాత శివసేనకు చెందిన మనోహర్ జోషి ఆ పదవిలో 2002 నుంచి 2004 వరకూ 13వ లోక్‌సభలో కొనసాగారు. కాగా, మూడేళ్లు వేచిచూసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన అవకాశాలను అందిపుచ్చుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం, అనంతరం పలు అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపు హవా కొనసాగించడం జరిగింది. అత్యున్నత పదవుల్లో తమ సభ్యులను స్వతంత్రంగానే బీజేపీ నియమించుకునేందుకు ఈ రెండు కారణాలూ దోహదపడ్డాయి.
nation
8,887
02-11-2017 15:27:14
గ్లామర్ రోల్స్‌కైనా రెడీ: నందితా శ్వేత
ఎక్కడి పోతావు చిన్నవాడా.. సినిమాలో నిఖిల్ సరసన అలరించిన భామ గుర్తుందా? నందితా శ్వేత. ఈ కోలీవుడ్ అమ్మడు ఇప్పుడు టాలీవుడ్‌లో బిజీ అవనుందనే టాక్ వినిపిస్తోంది. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ ఓ పెద్ద ప్రాజెక్ట్ కోసం ఆడిషన్‌లో పాల్గొన్నదని తెలుస్తోంది. దీంతో కొందరు ఫిల్మ్ మేకర్స్ కూడా తమ సినిమాల కోసం అమ్మడిని సంప్రదించారట. తన మొదటి సినిమా ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలో ట్రెడిషినల్‌గా కనిపించింది. కానీ ఇప్పుడు ఈ అమ్మడు గ్లామర్ రోల్స్‌లో కూడా నటిస్తానని చెప్పేసిందట. ఓ టాప్ ప్రొడ్యూసర్ కొడుకు హీరోగా నటిస్తున్న ఓ సినిమా కోసం కూడా నందితా శ్వేతను సంప్రదించారట.
entertainment
7,380
03-11-2017 21:37:24
అఖిల్‌పై ఈ వార్తలు నిజమేనా?
అఖిల్ అక్కినేనిపై ఓ వార్త నెట్ మాయాజాలంలో హల్‌చల్ చేస్తోంది. అఖిల్ నటించిన మొదటి చిత్రం భారీ పరాజయం చవిచూడటంతో.. రెండో సినిమా విషయంలో చాలా గ్యాప్ తీసుకున్నారు అఖిల్. రెండో చిత్రాన్ని మనం దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో స్వయంగా నాగార్జునే నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి టైటిల్ 'హలో!'. అయితే అఖిల్ ఈ సినిమా విషయంలో దర్శకుడు విక్రమ్ కుమార్ వర్క్‌కి అడ్డుపడుతున్నాడనే వార్త.. ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. ఎందుకంటే నాగార్జున ఒక్కసారి ఓకే చెప్పాడు అంటే చాలు, దర్శకుడికి పూర్తి స్వాతంత్ర్యం ఇస్తాడనే క్లీన్ ఇమేజ్ నాగ్ సొంతం. అటువంటిది ఎన్నో జాగ్రత్తలు తీసుకుని మరీ స్టార్ట్ చేసిన ఈ చిత్రం విషయంలో ఇప్పుడు అఖిల్ జోక్యం చేసుకుంటున్నాడని వార్తలు రావడం నిజంగా విశేషమే మరి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ, ఈ టైమ్‌లో అఖిల్‌పై ఇటువంటి వార్తలు రావడం అతని కెరియర్‌పై ప్రభావం చూపే అవకాశమైతే ఉంది. ఇక ఈ చిత్రం డిసెంబర్ 22న విడుదలవుతుందనే విషయం తెలిసిందే.
entertainment
1,596
12-12-2017 01:13:39
ఎవరిది తప్పు.. ఎవరు బాధ్యులు
మన దేశంలో బ్యాంకింగ్‌, బీమా, ఎంఎఫ్‌ రంగాల్లో నియంత్రణలు చాలా పటిష్ఠంగా ఉన్నాయి. ఆయా సంస్థలను నియంత్రించే ఆర్‌బిఐ, ఐఆర్‌డిఎ, సెబి సమన్వయంతో పని చేస్తూ ఆయా రంగాల అభివృద్ధికి దోహదపడుతున్నాయి. ఇందుకు ఆ సంస్థల చేతిలో ఉన్న సమర్థవంతమైన నియంత్రణాధికారాలే కారణం. అయినా ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌డిఐ చట్టం వంటి కఠిన నిర్ణయం తీసుకోవడం అవసరమా అన్న అంశంపై ప్రముఖ ఆర్థికవేత్త కె నరసింహమూర్తి విశ్లేషణ ఆంధ్రజ్యోతి పాఠకులకు ప్రత్యేకం. కర్ణుడి చావుకి కారణాలెన్నో అన్న తరహాలో బ్యాంకులు ఎన్‌పిఎల ఊబిలో కూరుకుపోవడానికి కూడా కారణాలెన్నో ఉన్నాయి. ఒక ప్రాజెక్టుని సరిగా మదింపు చేయకపోవడం వల్ల ఆ ప్రాజెక్టు విఫలమయ్యే అవకాశం ఉంటుంది. ప్రమోటర్లు నిధులు స్వాహా చేయడం మరో కారణం. ప్రమోటర్ల అసమర్థ నిర్వహణ, రుణగ్రహీతల ఖాతాలను బ్యాంకులు సరిగా తనిఖీ చేయకపోవడం కూడా వాటిని కష్టాల్లోకి నెడుతుంది. బ్యాంకు అధికారులు, సంస్థ యాజమాన్యం ఉద్యోగులు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడడం కూడా ఈ కోవలోకే వస్తుంది. ఇవన్నీ బ్యాంకును మోసం చేసే చర్యలే అయితే, ఎవరి ప్రమేయం లేకుండా కాలానుగుణంగా ఏర్పడే ఊహాతీతమైన పరిణామాల వల్ల ఎదురయ్యే ఒత్తిడులు ఆయా సంస్థలు రుణాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడేందుకు కారణమవుతాయి.  అంతర్జాతీయంగా ఏర్పడే రాజకీయ, భౌగోళిక పరిణామాలు, ప్రకృతి వైపరీత్యాల వంటివి వ్యాపారాలను దెబ్బ తీస్తూ ఉంటాయి. ప్రభుత్వాలపరంగా చూస్తే విధానాల్లో ఆకస్మిక మార్పులు వ్యాపారాలకు ప్రతిబంధకం అవుతాయి. ఇవన్నీ అలా ఉంచితే ఆర్‌బిఐ, సెబి, నబార్డ్‌, ఐఆర్‌డిఏ వంటి నియంత్రణ సంస్థల పర్యవేక్షణలోని లోపాలు, న్యాయస్థానాలు ఏదో ఒక కేసుని దృష్టిలో ఉంచుకుని మొత్తం వ్యవస్థనే ప్రభావితం చేసే విధంగా ఇచ్చే తీర్పులు కూడా బ్యాంకులు, ఆర్థిక సంస్థలను నష్టాల ఊబిలోకి నెడతాయి. ఉదాహరణకి ఐదేళ్ల క్రితం పర్యావరణ నిబంధనలను పాటించడంలేదన్న కారణంగా ఇనుప ఖనిజం మైనింగ్‌ను సుప్రీంకోర్టు నిషేధించింది. ఆ సమయంలో మైనింగ్‌ కార్యకలాపాలు స్తంభించిపోయి ఉక్కు రంగానికి ఇచ్చిన రుణాలు ఎన్‌పిఎలుగా మారిపోయాయి. అలాగే పర్యావరణవేత్తల ఆందోళనల కారణంగా ప్రాజెక్టులు స్తంభించిపోయి వాటి కోసం తీసుకున్న రుణాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఎన్‌పిఎలు పెరగడానికి ఇన్ని కారణాలుండగా ఆ బూచిని చూపించి ఆ నష్టాలు భరించమని సగటు డిపాజిటర్లను కోరడం అసమంజసం. ఆర్థిక సంస్థలు.. నియంత్రణ వ్యవస్థమన బ్యాంకింగ్‌, బీమా, మ్యూచువల్‌ ఫండ్‌ రంగాల నిర్వహణ ఎంతో కట్టుదిట్టంగా ఉంటుంది. సంస్థల బోర్డుల్లో కొత్త డైరెక్టర్‌ని చేర్చుకోవడం దగ్గర నుంచి పలురకాల అనుమతులు మంజూరు చేయడం వరకు నిబంధనలు చాలా పటిష్ఠంగా ఉన్నాయి. చివరికి డైరెక్టర్ల బోర్డు పనిచేసే తీరును కూడా ఈ నిబంధనలు నిర్దేశిస్తాయి. బ్యాంకుల రుణ వితరణ, నిధుల వినియోగం, పెట్టుబడి విధానాలు, ఆడిట్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థలు...ఈ విధంగా మొత్తం ఆర్ధిక సంస్థ నిర్వహణను నిబంధనలు నిర్దేశిస్తాయి. ఆర్‌బిఐ ప్రతి సంవత్సరం బ్యాంకుల పద్దులను తనిఖీ చేస్తూ ప్రతి నెలా ఆయా బ్యాంకుల ఆర్థిక స్థితిపై నివేదికలు తీసుకుంటూ నిరంతరం బ్యాంకులను తన చెప్పుచేతల్లో ఉంచుకుంటుంది. ఇటువంటి నేపథ్యంలో ఒక ఆర్థిక సంస్థను బెయిల్‌ ఇన్‌ చేయాలని సగటు డిపాజిటర్‌ను కోరడం ఎంతవరకు సమంజసం? నియంత్రణలు ఇంత పటిష్ఠంగా ఉన్నప్పుడు ఆయా బ్యాంకులు దివాలా తీసిన సందర్భాల్లో ఆర్‌బిఐకి బాధ్యత లేదా? ఆర్‌బిఐ, సెబి, ఐఆర్‌డిఎలపై నమ్మకం కోల్పోయి ప్రభుత్వం ఇలాంటి చర్యకు పాల్పడుతోందా...? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. 2008 సంవత్సరంలో అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభంలో ప్రపంచశ్రేణి బ్యాంకులు దివాలా తీసినా కూడా మన బ్యాంకింగ్‌ రంగం తట్టుకుని నిలవగలిగిందంటే ఆ నియంత్రణలే కారణం.  2002లో అర్బన్‌ బ్యాంకుల సంక్షోభం తర్వాత వాటి రక్షణకు తీసుకున్న చర్యలు సత్ఫలితాలనే ఇచ్చాయి.వాణిజ్య బ్యాంకుల విషయానికి వస్తే 1990 దశకంలో న్యూ ఇండియా బ్యాంకు కష్టాల్లో పడితే దాన్ని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో విలీనం చేశారు. 2002-03 సంవత్సరాల్లో గ్లోబల్‌ ట్రస్ట్‌ బ్యాంక్‌ సంక్షోభంలో పడినప్పుడు దాన్ని ఒబిసిలో విలీనం చేశారు. ఈ సంఘటనలు మినహా మన దేశంలో వాణిజ్య బ్యాంకులు కుప్పకూలిన సంఘటనలేవీ ఇటీవల కాలంలో లేవు. ప్రభుత్వం, ఆర్‌బిఐ, ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ చక్కని సమన్వయంతో పనిచేసి బ్యాంకింగ్‌ రంగాన్ని సంక్షోభంలో పడకుండా కాపాడగలిగాయి. బ్యాంకుల కష్టాలకు ఎవరెవరు బాధ్యులు, ఎందుకు అవి ఎన్‌పిఎల ఊబిలో కూరుకుపోయాయి వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించకుండా సగటు డిపాజిటర్ల మీద పడడం వల్ల ఎన్నో చట్టపరమైన చిక్కులు ఎదురు కావచ్చు.   ఒకపక్క డీమానిటైజేషన్‌ చేదు అనుభవం నుంచి ప్రజలు ఇంకా బయటపడలేదు. మరోపక్క జిఎ్‌సటికి ఆర్థిక వ్యవస్థ అలవాటు పడాల్సి ఉంది. ఇలాంటి స్థితిలో ఈ తరహా నిర్ణయం తీసుకోవడం కొరివితో తల గోక్కున్నట్టే అవుతుంది. బ్యాంకులు, నియంత్రణ సంస్థల వైఫల్యాలకు డిపాజిటర్లు శిక్ష అనుభవించాలా?
business
15,847
03-06-2017 03:04:18
2 లక్షలు నగదు లావాదేవీలొద్దు
 అతిక్రమిస్తే 100 శాతం జరిమానా వివరాలు తెలపాలని కోరిన ఐటీ శాఖన్యూఢిల్లీ, జూన్‌ 2: నల్లధనాన్ని అరికట్టడం కోసం నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్న కేంద్రం ఆ దిశగా కఠిన చర్యలు తీసుకుంటోంది. రెండు లక్షల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తం నగదు లావాదేవీలను నిర్వహించరాదని శుక్రవారం ఆదాయపన్ను శాఖ హెచ్చరించింది. నిబంధనలను అతిక్రమించి నగదు తీసుకున్నవారు అంతే మొత్తం జరిమానాగా కట్టాల్సి ఉంటుందని పేర్కొంది. ఇలాంటి వ్యవహారాలు ఎవరి దృష్టికి వచ్చినా తమకు తెలియజేయాల్సిందిగా ఆదాయ పన్ను శాఖ ప్రజలను కోరింది. వివరాలను blackmoneyinfo@inco metax.gov.in కు మెయిల్‌ ద్వారా తెలిపాలని సూచించింది. ఐటీ చట్టంలోని కొత్త 269ఎస్‌టీ సెక్షన్‌ ప్రకారం ఒకేరోజులో ఇలాంటి నగదు లావాదేవీలపై నిషేధం విధించారు. నగదు తీసుకున్నవారికి 100 శాతం జరిమానా విధిస్తామని ఐటీ శాఖ ఓ ప్రకటనలో తెలియజేసింది. గత ఏప్రిల్‌ 1 నుంచి రెండు లక్షలు లేదా ఎక్కువ మొత్తం నగదు లావాదేవీలపై కేంద్రం నిషేధించిన సంగతి తెలిసిందే. 2017-18 కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ 3 లక్షల నగదు లావాదేవీలను నిషేధించాలని ప్రతిపాదించారు. కాగా ఆర్థిక బిల్లులో సవరణ చేసి ఈ పరిమితిని రెండు లక్షలకు తగ్గించగా లోక్‌సభ ఆమోదించింది. కాగా బ్యాంకులు, కో-ఆపరేటివ్‌ బ్యాంకులు, పోస్ట్‌ ఆఫీసు సేవింగ్స్‌ ఖాతాల ఉపసంహరణలకు ఈ నిబంధనలు వర్తించవు.
nation
112
31-08-2017 02:19:44
రూ. 9.8 కోట్ల బకాయిలు ఇప్పించిన ఇండస్ట్రియల్‌ కౌన్సిల్‌
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు రావాల్సిన సుమారు రూ.9.8 కోట్లకు పైగా బకాయిలను ఇండస్ట్రియల్‌ ఫెసిలిటేషన్‌ కౌన్సిల్‌ ఇప్పించింది. ఈ పరిశ్రమల ఉత్పత్తులను వినియోగించుకుని బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న సంస్థలపై ఫిర్యాదులు వచ్చాయి. రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్‌ అహ్మద్‌ నదీం ఆధ్వర్యంలో ఏర్పాటైన ఇండస్ట్రియల్‌ ఫెసిలిటేషన్‌ కౌన్సిల్‌ వీటిని పరిశీలించి ప్రతివాదులు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. తమకు బకాయిలు ఇప్పించాలని కోరూతూ 122 సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల యజమానులు ఫిర్యాదు చేశారు. ఇందులో సుమారు పది సంస్థలకు సంబంధించి దాదాపు రూ9.8 కోట్లకు పైగా బకాయిలు చెల్లించేందుకు ఆయా సంస్థల ప్రతినిధులు అంగీకారం తెలిపినట్టు కౌన్సిల్‌ కార్యదర్శి, పరిశ్రమల శాఖ అదనపు కమిషనర్‌ ఆర్‌బి దేవానంద్‌ తెలిపారు.
business
20,955
16-12-2017 03:08:01
ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు
కొలంబో: రవిశాస్త్రి.. యువరాజ్‌.. గిబ్స్‌ వీరంతా ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాది చరిత్ర సృష్టించారు. ఇప్పుడు వీరిని తలదన్నేలా 15 ఏళ్ల కుర్రాడు ఒకే ఓవర్‌లో ఏడు సిక్సర్ల (ఒక బంతి నోబ్‌)తో చెలరేగాడు. అండర్‌-15 మురళీ గుడ్‌నెస్‌ కప్‌ ఫైనల్లో నవీందు పహసర (89 బంతుల్లో 109) ఎఫ్‌ఓజీ అకాడమీ తరఫున ఈ ఫీట్‌ సాధించాడు. లంక మాజీ స్పిన్నర్‌ మురళీధరన్‌ తన ఫౌండేషన్‌ తరఫున ఈ టోర్నీ నిర్వహిస్తున్నాడు. నవీందు అద్భుత ఇన్నింగ్స్‌తో కొట్టావాపై నెగ్గి ఎఫ్‌ఓజీ టైటిల్‌ సాధించింది.
sports
README.md exists but content is empty. Use the Edit dataset card button to edit it.
Downloads last month
46
Edit dataset card